Friday, April 26, 2024
- Advertisement -

సీఎం కేసీఆర్ ని కలిసిన చిరు, నాగార్జున.. కారణం అదేనా?

- Advertisement -

సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత కేవలం తమ స్వలాభమే కాదు.. అవసరమైతే తమ అభిమానుల కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. ముఖ్యంగా ప్రకృతి విలయ తాండవం చేసిన సమయంలో హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు తమకు తోచిన విరాళం ఇస్తూ కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటారు. సాధారణంగా సినీ నటులు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కావడం చూస్తుంటాం. ముఖ్యంగా సినీ కష్టాలు ముఖ్యమంత్రితో చర్చించడం చూస్తూనే ఉంటాం.

ఆ మద్య కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సినీ కార్మికుల కోసం సీసీసీ స్థాపించారు మెగాస్టార్. ఇక ఇండస్ట్రీ నుంచి ఎప్పుడూ సీఎంను కలిసే వాళ్ల లిస్టులో చిరు, నాగార్జున ముందుంటారు. తాజాగా మరోసారి వాళ్లు కేసీఆర్ తో భేటీ అయ్యారు. తాజాగా ప్రగతి భవన్ లోనే ముఖ్యమంత్రిని కలిసి కొన్ని విషయాలు చర్చించారు చిరు, నాగ్. ఆ మధ్య లాక్‌డౌన్ సమయంలో కూడా ఇలాగే ముఖ్యమంత్రిని కలిసారు.. మొన్నామధ్య హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన వరదలలో ఎంతోమంది నష్టపోయారు.. ఆర్థికంగా కూడా వేల కోట్ల నష్టం వచ్చింది. 

తాజాగా సిఎం రిలీఫ్ ఫండ్‌కు మన హీరోలు చాలా మంది లక్షలు, కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. వాటిని ముఖ్యమంత్రికి అందించడానికి కేసీఆర్ ను కలిసారు చిరంజీవి, నాగార్జున. ఈ నేపథ్యంలో తెలంగాణలో థియేటర్స్ ఓపెనింగ్ గురించి కూడా చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

సర్కార్ వారి పాట కు ఓ చిన్న బ్రేక్..!

ప్రభాస్ మూవీకోసం అమితాబ్ కి ఎంత ఇస్తున్నారో తెలుసా ?

దట్ ఈజ్ పవర్ స్టార్.. రోజుకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

ఒక్క రోజు షూటింగ్ చేస్తే రమ్యకృష్ణకు ఎంత ఇస్తారో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -