Monday, April 29, 2024
- Advertisement -

కుమ్రంభీంకు ముస్లిం టోపీ.. రచయిత విజయేంద్ర ప్రసాద్​ రియాక్షన్​ ఇదే..!

- Advertisement -

ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో జూనియర్​ ఎన్టీఆర్​ కుమ్రం భీం పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక రామ్​చరణ్​ అల్లూరి సీతారామరాజును పాత్రను చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆర్​ఆర్​ఆర్​ భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గతంలో విడుదలైన ట్రైలర్​లో కుమ్రం భీం పాత్ర పోషించిన ఎన్టీఆర్​ ముస్లిం టోపీ పెట్టుకొని కనిపించాడు. దీంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా చరిత్రకారులు దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మరోవైపు బీజేపీ శ్రేణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కుమ్రం భీం తన జీవిత కాలంలో ఏనాడూ ముస్లీం టోపిని ధరించలేదని ఆయన వారసులు ప్రకటించారు. మరోవైపు చరిత్రకారులు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కుమ్రం భీం ముస్లిం టోపీ పెట్టుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ విషయంపై అప్పట్లో పెను దుమారం రేగింది. ఏకంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పందించారు. ఇదిలా ఉంటే ఈ వివాదంపై తాజాగా ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్​ స్పందించారు.

ఓ ఇంగ్లిష్​ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ నిజానికి ఇది చారిత్రక చిత్రం అయినప్పటికీ కొన్ని కల్పనలు జోడించాము. కుమ్రం భీం నిజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అలా ముస్లిం టోపి పెట్టుకుంటాడు. ఇక అల్లూరి సీతారామరాజు పోలీస్​ గెటప్​లో ఉన్నాడు. ఇందుకు ఓ కారణం ఉంది. అదేమిటో ప్రేక్షకులు థియేటర్​లో చూస్తే థ్రిల్​ అవుతారు. ఇంకా ఈ సినిమాలో చాలా అంశాలు ఉన్నాయి’ అంటూ ఆయన స్పందించారు. వివాదం సద్దుమణిగిన అనంతరం ఇంతకాలానికి వ్యూహాత్మకంగా విజయేంద్రప్రసాద్​ స్పందించడం గమనార్హం.

Also Read

20 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

సీక్రెట్ గా..స్పీడ్ గా.. కొత్త సినిమా షూటింగ్ ముగించిన మారుతి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -