వెంకీమామ ట్రీట్ రెడీ… ఎప్పుడు ఇస్తాడంటే?

- Advertisement -

విక్టరీ వెంకటేష్, ప్రియమణి హీరోహీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో “నారప్ప” సినిమా తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచిస్తున్నారు.

ఈ క్రమంలోనే నారప్ప చిత్రం నుంచి చిత్ర బృందం స్పెషల్ ట్రీట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే వారం ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయాలని, అదే రోజే ఈ చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా రెండు వార్తలను ఒకటే రోజు చెబుతూ విక్టరీ అభిమానులను చిత్ర బృందం సందడి చేయనున్నారు.”అసురన్‌” సినిమాకి రీమేక్ గా రూపొందిన నారప్ప సినిమా ద్వారా వెంకటేష్ విభిన్న పాత్రలో కనిపించనున్నారు.

Also read:ఏడాదిలో రూ.150 కోట్లు వదులుకున్న ప్రభాస్..?

నారప్ప సినిమా పూర్తి చేసుకున్న వెంకటేష్ దృశ్యం సినిమా సీక్వెల్ చిత్రం దృశ్యం 2లో నటిస్తున్నారు. అదేవిధంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 లో కూడా వెంకటేష్ నటిస్తున్నారు.ఈ రెండు చిత్రాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఇక ప్రియమణి ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

Also read:బాలీవుడ్ లో పక్కపక్కన ఉంటున్న స్టార్స్ వీళ్ళే!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -