Tuesday, May 7, 2024
- Advertisement -

జార్ఖండులో ఘోరం : స‌హాయంకోసం ఫోన్ చేసిన యువ‌తుల‌పై 11 మంది అత్యాచారం..

- Advertisement -

 

ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. సొంత వాల్లే అమ్మాయిలు, మ‌హిళ‌ల‌ప‌ట్ల దారునంగా వ్వ‌వ‌హ‌రిస్తున్నారు. మధ్యలో బైక్ ఆగిపోవడంతో సాయం చేయాలని ఓ అమ్మాయిు స్నేహితుడికి ఫోన్ చేయగా, అతను ఘటనాస్థలికి 11 మందిని పంపాడు. వీరు సాయం చేయకుండా అక్కడ ఉన్న ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జార్ఖండ్ లోని లోహర్దగా జిల్లాలో ఆగస్టు 16 న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జార్ఖండ్ లోని హిర్హీ హర్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ యువతులు తమ పొరుగింటి వ్యక్తితో కలసి గ్రామానికి తిరిగివస్తున్నారు. ఇంతలో మార్గమధ్యంలో బైక్ ఆగిపోయింది. దీంతో ఇద్దరు యువతుల్లో ఒకరు తమ పరిస్థితిని తెలియజేస్తూ ఓ స్నేహితుడికి ఫోన్ చేశారు. దీంతో సదరు వ్యక్తి వెంటనే ఘటనాస్థలికి 11 మంది తన స్నేహితులను పంపాడు.

సుమారు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న యువకులు తొలుత పొరుగింటి వ్యక్తిపై దాడిచేసి అతడిని తరిమేశారు. అనంతరం యువతులను నిర్మానుష్య ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాదు ఈ విషయం బయటకు చెప్పకుండా ఉండాలని హెచ్చరించి వారి మొబైల్ ఫోన్లు లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనపై ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన జార్ఖండ్ పోలీసులు.. 11 మందిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -