Monday, April 29, 2024
- Advertisement -

ఏపీ కేబినెట్ నిర్ణయాలివే..

- Advertisement -

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతా ఊహించినట్లే వైఎస్సార్ ఆసరా,వైఎస్సార్ చేయూత పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సామాజిక పెన్షన్ లను 2024 జనవరి 1 నుండి రూ.3000 వేలు అందించనున్నారు.

ఏపీ కాబోయే రాజధాని వైజాగ్ లో లైట్ మెట్రోకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కు కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. జనవరి 1 నుంచి ఈ పథకం అమలు చేయనన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లో ఉచిత చికిత్స ల పరిమితిని 25 లక్షలకు పెంచేందుకు కేబినెట్ అమోదం తెలిపింది. ఇప్పటివరకూ 5 లక్షలుగా ఉన్న ఈ పరిమితిని ఏకంగా ఐదు రెట్లు పెంచారు.

ఈ నెల 18 నుండి ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు కొత్త కార్డుల్ని ఇవ్వబోతున్నారు. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.దీంతో విశాఖ లో నాలుగు కారిడార్ లలో మెట్రో నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి మంత్రివర్గ సమావేశం సంతాపం తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -