Monday, April 29, 2024
- Advertisement -

పట్టు నిలుపుకున్న బొత్స..ఈసారి 5 సీట్లు!

- Advertisement -

బొత్స సత్యనారాయణ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా తనదైన ముద్రవేశారు బొత్స. రాష్ట్ర విభజన తర్వాత జగన్ వెంట నడిచిన బొత్స ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఇక తాజాగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరిస్తుండగా బొత్స మాత్రం జాక్ పాట్ కొట్టేశారు.

గత ఎన్నికల్లో బొత్స కుటుంబం నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక జడ్పీ ఛైర్మన్ ఉన్నారు. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, గజపతినగరం నుండి బొత్స అప్పలనర్సయ్య,నెల్లిమర్ల నుండి చి సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు పోటీ చేసి గెలుపొందారు. బొత్స మేనల్లుడు స్థానిక సంస్థలు ఎన్నికల్లో జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈసారి కూడా బొత్స కుటుంబానికి మంచి ప్రాధాన్యం దక్కింది.

చీపురుపల్లి నుంచి మళ్లీ బొత్సకు అవకాశం దక్కనుండగా, గజపతినగరం నుంచి ఆయన తమ్ముడు అప్పలనర్సయ్య, నెల్లిమర్ల నుంచి తోడల్లుడు బడ్డుకొండ అప్పలనాయుడు బరిలోకి దిగనున్నారు. ఇక బొత్స సతీమణి ఝాన్సీ ఈసారి విశాఖ ఎంపీగా బరిలో దిగనున్నారు. అలాగే జడ్పీ చైర్మన్‌గా ఉన్న మజ్జి శ్రీనివాస్‌ రావును విజయనగరం ఎంపీగా బరిలోకి దించనుంది వైసపీ. ఇలా ఈసారి బొత్స కుటుంబం నుండే ఇద్దరు ఎంపీలుగా, ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. మొత్తంగా విజయనగరం జిల్లాపై తన పట్టు కొనసాగిస్తున్నారు బొత్స. మరి వీరిలో ఎంతమంది గెలుస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -