Thursday, May 2, 2024
- Advertisement -

కాంగ్రెస్ ట్రాప్‌లో పడకండి..కేసీఆర్!

- Advertisement -

తెలంగాణలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. పెద్ద ఎత్తున కారు పార్టీ నుండి కాంగ్రెస్‌లో చేరికలుంటాయని ప్రచారం జరుగుతుండగా అందుకు తగ్గట్టుగానే ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే…సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారు. మర్యాదపూర్వక భేటీ అనే చెబుతుండగా బీఆర్ఎస్‌లో గుబులు మొదలైంది.

ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్.. తొందరపడొద్దంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని..కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమయం ఇద్దామని, పార్టీ పరంగా తదుపరి కార్యాచరణ అమలు చేద్దామని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.

కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు జాగ్రత్తగా ఉండాలని…. సీఎంను మంచి ఉద్దేశంతో కలిసినా తప్పుడు సంకేతాలు వెళ్తాయని నియోజకవర్గాల అభివృద్ధికోసం మంత్రులకు ప్రజల సమక్షంలోనే వినతిపత్రాలు అందజేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం అసాధ్యమని…పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు బీఆర్ఎస్‌కే అనుకూలంగా రానున్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డికి రాజకీయంగా పెద్దగా అనుభవం లేదని, పాలనాపరంగా కూడా అనుకున్న ఫలితాలు సాధించలేడని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ భవన్ కేంద్రంగానే అందుబాటులో ఉంటానని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -