Sunday, April 28, 2024
- Advertisement -

రాజ్యసభ లేదా లోక్ సభకు నాగ్‌!

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో మరో సినీ హీరో పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా…?అధికార వైసీపీ నుండి పోటీ చేసేందుకు ఆ హీరో ఆసక్తి చూపిస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో ముందస్తు లేదా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా సినీ గ్లామర్‌ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్. టీడీపీకి ఉన్న సినీ గ్లామర్‌ని తనవైపుకు తిప్పుకోవాలంటే నాగార్జుననే సరైన వాడని భావిస్తున్నారట జగన్.

ఇందులో భాగంగా అగ్రహీరో నాగార్జునను వైసీపీ నుండి ఎంపీగా బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారట వైసీపీ అధినేత. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుండే ఆ ఫ్యామిలీతో నాగార్జునకు సత్సంబంధాలున్నాయి. తర్వాత జగన్‌తోనూ అదే ర్యాపోను మెయింటేన్ చేస్తూ వస్తున్నారు నాగ్. జగన్ జైలులో ఉన్నపుడు కూడా వెళ్ళి పరామర్శించారు నాగార్జున.

ఈ నేపథ్యంలోనే ఈసారి టీడీపీని భూస్ధాపితం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్‌..టీడీపీకి ఉన్న మూడు ఎంపీ స్ధానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నాగ్‌ని విజయవాడ పార్లమెంట్ బరిలో దించాలనే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ లోక్ సభకు పంపడం వీలుకాకపోతే రాజ్యసభకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో రాజ్యసభకు ఎన్నికలు జరగనుండగా రెండు స్ధానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఒకటి నాగార్జున కోసం రిజర్వ్‌ చేసి ఉంచారట.

నాగార్జునకు ఉన్న ఇమేజ్‌ వైసీపీకి ఉపయోగపడుతుందని భావించిన జగన్ ఈ మేరకు పొలిటికల్ ఎత్తుగడ వేశారట. అక్కినేని కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీ నుండి పోసాని, అలీ లాంటి నటుల మద్దతు వైసీపీకి ఉన్నా అది పార్టీకి అంతగా ప్లస్ కావడం లేదు. దీంతో నాగ్ వంటి అగ్రహీరోను బరిలోకి దింపడం ద్వారా ప్లస్ అవుతుందని భావిస్తున్నారట జగన్. అంతేగాదు నాగ్ సామాజిక వర్గం కమ్మ కావడంతో ఆ క్యాస్ట్ లో వైసీపీ ఓటు బ్యాంకు పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఏదిఏమైనా నాగ్ పొలిటికల్ ఎంట్రీపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -