ఆకాశం నీ హద్దురా.. హిందీ రీమేక్​లో మారిన హీరో..!

- Advertisement -

సుధా కొంగర తెరకెక్కించిన సురారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) ఎంత పెద్ద హిట్​ అయ్యిందో తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సూర్యాకు చాలా రోజుల తర్వాత భారీ హిట్ ను అందించింది. ఎయిర్​ డెక్కన్​ వ్యవస్థాపకుడు జీఆర్​ గోపీనాథ్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. అవార్డులను కొల్లగొట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

షాంఘైలోని అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈ సినిమా ఎంపికైంది. సూర్య, అపర్ణ బాలమురళి నటనకు ప్రశంసలు దక్కాయి. దీంతో ఈ సినిమాను హిందీలో రీమేక్​ చేయాలని సూర్య డీ ఎంటర్​టైన్మెంట్​, విక్రమ్​ మల్హోత్రా అంబుంటాండియా ఎంటర్​టైన్మెంట్​ సంయుక్తంగా భావించాయి. అయితే ఈ సినిమాలో తొలుత హృతిక్​ రోషన్​ను హీరోగా పెట్టాలని భావించారు. కానీ వివిధ కారణాలతో ఆయన తప్పుకున్నట్టు టాక్​.

ప్రస్తుతం హృతిక్​ ప్లేస్​లో అక్షయ్​ కుమార్​ పేరు వినిపిస్తోంది. విభిన్న కథాంశాలు, విభిన్న పాత్రలు చేసేందుకు అక్షయ్​ ఎప్పుడూ ముందుంటాడు. ఈ క్రమంలో సురారై పొట్రు హిందీ రీమేక్​లో చేసేందుకు అక్షయ్​ ఆసక్తిగా ఉన్నాడట. సౌత్ సినిమాలను రీమేక్ చేయడంలో అక్షయ్ కుమార్ ముందు ఉంటారు. గతంలో పలు సౌత్ సినిమాలను ఆయన రీమేక్ చేసి హిట్ అందుకున్నారు.

Also Read

20 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

మరో స్టార్ హీరో మూవీ ఓటీటీ బాట..!

రజనీ కాంతా మజాకా.. ఇక్కడ ప్లాపయిన సినిమా జపాన్ లో కుమ్మేస్తోంది..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -