‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సంగతి తెలుసా?

- Advertisement -

సినీ ప‌రిశ్ర‌మ‌లో చిన్న పెద్ద సినిమా అనే తేడా లేకుండా.. విడుద‌లైన ప్ర‌తి సినిమాకు రాత్రిలోపు క‌లెక్ష‌న్ల వివ‌రాలు చెప్ప‌డం చాలా కాలం నుంచి కొన‌సాగుతుంది. ఇక పెద్ద హీరోల సినిమాల‌కు సంబంధించి ఈ విష‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ విష‌యం ఎందుకొచ్చిందంటే.. చాలా గ్యాప్ తీసుకుని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెండితెర‌పై వ‌కీల్ సాబ్ గా సంద‌డి చేస్తున్నారు.

తాజాగా విడుద‌లైన ఈ సినిమా థియేట‌ర్ల‌లో దుమ్మురేపుతోంది. ప‌వ‌న్ అభిమానుల హంగామా మాములుగా లేదు. సినీ వ‌ర్గాలు సైతం ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ రాబ‌డుతోన్న వ‌కీల్ సాబ్ మూవీకి సంబంధించి క‌లెక్ష‌న్ల వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ప‌వ‌న్ అభిమానులు విస్మ‌యానికి గుర‌వుతున్నారు.

- Advertisement -

అయితే, వ‌కీల్ సాబ్ క‌లేక్ష‌న్లు బ‌య‌ట‌పెట్ట‌క‌పోవ‌డానికి ప్ర‌ధానం కార‌ణం ఇటీవ‌ల ఏపీలో చోటుచేసుకున్న ప‌రిణామాలే కార‌ణంగా తెలుస్తోంది. ఎందుకంటే టికెట్ రేట్ల విష‌యంలో తీవ్ర స్థాయిలో ర‌గ‌డ న‌డుస్తోంది. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం కాస్తా గుర్రుగానే ఉంది. ఇలాంటి త‌రుణంలో క‌లేక్ష‌న్ల వివ‌రాలు బ‌య‌ట పెడితే ఎక్క‌డ బుక్ అవుతామోన‌నే భ‌యంతో బ‌య్య‌ర్లు, ఎగ్జిబ్యూట‌ర్లు ఉన్నార‌ని టాక్. అందుకే క‌లేక్ష‌న్ల వివ‌రాలు వెల్ల‌డించ‌డం లేద‌ట‌..

గొంతునొప్పిని ఇట్టే త‌గ్గించే చిట్కాలు ఇవిగో !

క‌రోనాతో క‌న్నుమూసిన న‌టుడు సతీష్ కౌల్

యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది భ‌క్తులు మృతి

మాస్కు పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా: తెలంగాణ పోలీసులు

నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే మీకు ఆ రోగాలున్న‌ట్టే?

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -