Sunday, April 28, 2024
- Advertisement -

ప్రత్యేకహోదాపై మోడీ ప్రభుత్వ మోసం బట్టబయలు

- Advertisement -

ఏపీకి నరేంద్రమోడీ, బీజేపీ ప్రభుత్వం చేసిన మోసం మరోసారి బట్టబయలైంది. ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి, నయవంచనకు పాల్పడ్డారంటూ చంద్రబాబు చేస్తున్న వాదనకు మరింత బలం చేకూరింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదని, ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 14వ ఆర్ధిక సంఘం అనుమతి ఉండాలని, కానీ ఏపీకి హోదా ఇవ్వవద్దని 14వ ఆర్ధిక సంఘం తేల్చి చెప్పిందని ఇన్నాళ్లూ అరుణ్ జైట్లీ సహా బీజేపీ నేతలు చెప్పినవి పచ్చి అబద్ధాలేనని తేటతెల్లమైపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా 14వ ఆర్థిక సంఘం అడ్డుకుందని, కేంద్ర ప్రభుత్వం చెప్పడం పూర్తిగా అబద్ధమని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. అసలు ఏపీకే కాదు ఏ రాష్ట్రానికైనా ప్రత్యేకహోదా ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది తమ పరిధిలోకి రాని అంశమని స్పష్టం చేశారు. స్పెషల్ స్టేటస్ అంశం పూర్తిగా రాజకీయ పరమైన నిర్ణయం తప్ప, దానికి ఆర్ధికసంఘానికి సంబంధం లేదని తేల్చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఎన్డీసీదే బాధ్యతని స్పష్టం చేశారు. స్పెషల్ స్టేటస్ అంశం 14వ ఆర్ధిక సంఘమే కాదు, 15వ ఆర్దిక సంఘం పరిధిలోకి కూడా రాదని ఆయన అమరావతిలో తేల్చిచెప్పారు. విభజనతో ఆర్ధికంగా నష్టపోయిన ఏపీపై తనకు సానుభూతి ఉందన్నారు. ఏపీ రెవెన్యూ లోటు భర్తీ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను అందజేస్తే పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు. తమ పరిధిలో లేని ప్రత్యేకహోదా అంశాన్ని తాము అడ్డుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం, 14వ ఆర్ధిక సంఘంపై నెపం నెట్టేసి తప్పించుకోవాలని చూడటం బాధాకరమన్నారు.

గతంలో విభజన చట్టాల అమలుకు ప్రత్యేక వ్యవస్ధ ఉండేదని, ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌ కే సింగ్‌ చెప్పారు. ఆ వ్యవస్థ విభజన చట్టాల అమలు బాధ్యతను తమ భుజాన వేసుకుని, విభజిత రాష్ట్రాలకు పూర్తి న్యాయం జరిగే వరకూ ప్రయత్నాలు చేసేవని గుర్తు చేశారు. కానీ ఏపీ పునర్విభజన చట్టం అమలుకు పర్యవేక్షణ వ్యవస్ధ అనేదే లేదని విచారం వ్యక్తం చేశారు. గతంలో విభజన చట్టం అమలుకు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ బాధ్యులుగా ఉండేవారని చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టం పార్లమెంటులోకి వచ్చినప్పుడు తాను రాజ్యసభలో ఉన్నానని గుర్తు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చినప్పుడు బీజేపీ సీనియర్ నేత, నేటి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నాడు రాజ్యసభలో చప్పట్లు కొట్టి మరీ ఆహ్వానించారని ఎక్ కే సింగ్ గుర్తు చేశారు. అలాంటి నాయకులు నేడు హోదా ఇవ్వకుండా, హామీలను తుంగలో తొక్కేసి, 14వ ఆర్ధికసంఘం అడ్డుకుందని చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. అయితే 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌ కే సింగ్‌ తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్, టీడీపీ నేతలకు కొండంత బలం వచ్చింది. ఏపీని మోసం చేసిన బీజేపీ నేతల గుట్టురట్టు చేసినందుకు ఎన్ కే సింగ్ ను ఆ పార్టీలు అభినందిస్తున్నాయి. ఇక ఇదే అంశాన్ని ప్రజల్లోకి మరింత గట్టిగా తీసుకెళ్తామని చెబుతున్నాయి. మరి 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌ కే సింగ్‌ వ్యాఖ్యలపై జనసేన, వైఎస్ఆర్ సీపీ ఏమంటాయో చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -