Wednesday, May 1, 2024
- Advertisement -

మ‌ధ్య‌పాన నిషేధంపై జ‌గ‌న్ తొలి అడుగు…

- Advertisement -

పాల‌న‌లో మార్పులు తీసుకువ‌స్తా.. మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అని ప్రమాణ స్వీకారం రోజే చెప్పిన ఏపీ సీఎం జగన్ ఆదిశ‌గా ఒక్కొక్క అడ‌గు ముందుకేస్తున్నారు. ఇప్ప‌టికే ఫెన్ష‌న్ల పెంపును అమ‌లు చేసిన జ‌గ‌న్ సంపూర్ణ‌మ‌ధ్య‌పాణం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాష్ట్రంలో ద‌శ‌ల‌వారీగా మ‌ధ్య‌పానాన్ని నిషేధిస్తామ‌ని చెప్పిన విధంగానె మొద‌టి అడుగు వేశారు.

ఉద‌యం తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో ఆర్థిక‌, రెవిన్యూశాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌న జ‌గ‌న్ …మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఏపీలో ఉన్న బెల్టు షాపులను ఎత్తివేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా చూడాలనీ, ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని పునరుద్ఘాటించారు.

మద్యపానాన్ని నిరుత్సాహ పరిచేలా కార్యాచరణ ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. గొలుసు దుకాణాలపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీపడొద్దని అధికారులకు సూచించారు. రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వడ్డీలు కట్టేందుకు కూడా అప్పులు ఎందుకు చేస్తున్నామని అధికారులను నిలదీశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -