Monday, April 29, 2024
- Advertisement -

బాబు క్యేబినేట్ మీటింగ్‌పై స్పందించిన సీఎస్‌…

- Advertisement -

ఏపీలో సీఎం చంద్ర‌బాబు, సీఎస్‌ల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది. ఇది ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఈ నెల ప‌దిన క్యేబినేట్ ఏర్పాటు చేస్తాన‌ని ఎవ‌రు అడ్డుకుంటారో చూస్తాన‌ని బెదిరింపు దోర‌ణితో మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. క్యేబినేట్ మీటింగ్‌కు సంబంధించి ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి కేబినెట్‌ భేటీకి సంబంధించి నోట్‌ తనకు వచ్చిందని సీఎస్ ఎల్వీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలన్న సీఎం చంద్రబాబునాయుడి నిర్ణయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. కేబినెట్‌ భేటీలో ఏయే అంశాలపై నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారో తెలియజేయాలని సీఎంను కోరినట్టు ఆయన తెలిపారు.

కేబినెట్‌ భేటీకి అజెండానే కీలకమని.. అజెండాలోని అంశాల ఆధారంగానే ఈసీ అనుమతిస్తుందని తెలిపారు. ఈక్రమంలో అజెండాలోని అంశాలపై సీఎంవోను సీఎస్‌ వివరణ కోరారు. ఏయే అంశాలపై కేబినెట్‌ భేటీ నిర్వహిస్తున్నదీ ఈసీకి చెప్పాల్సి ఉందన్నారు.

ఈసీ నిబంధనలను సీఎం చంద్రబాబుకు వివరించాల్సిందిగా ఆయన సెక్రటరీకి సూచించినట్టు వెల్లడించారు. కేబినెట్‌ అజెండాను పరిశీలించి.. ఎన్నికల సంఘానికి పంపుతామని, ఆ అజెండాను ఈసీ ఆమోదించాకే కేబినెట్‌ భేటీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అజెండాను పంపించిన తర్వాత.. దానిని పరిశీలించేదుకు ఈసీ కనీసం 48 గంటల సమయం పడుతుంద‌న్నారు.ఐతే.. కేబినెట్‌ సమావేశం పెట్టే స్థాయి నిర్ణయాలు ఉంటేనే ఈసీ అనుమతిస్తుందని ఎల్వీ చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -