Tuesday, April 30, 2024
- Advertisement -

కశ్మీర్‌లో ఉగ్రవాదుల పోస్టర్ల కలకలం…హైఅలర్ట్ ప్రకటించిన సైన్యం

- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు జరగకుండా కేంద్రం భారీగా సైన్యాన్ని మోహరించింది. పరిస్థితులు కుదుట పడుతున్న తరుణంలో ఉగ్రవాదుల పోస్టర్లు కలకలం రేపాయి. క్రమంగా ఆంక్షలను ఎత్తివేస్తున్న సమయంలో ఉగ్రవాదుల పేరిట లోయలో బ్యానర్లు వెలవడం షాక్ ఇస్తోంది. దీంతో సైన్యం ఒక్క సారిగా ఉలిక్కిపడింది.

రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతారని భావించినా సైన్యం తీసుకున్న పటిష్ట చర్యల కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటను చోటుచేసుకోలేదు. ఉగ్రవాదుల పోస్టర్లు ప్రత్యక్షం కావడంతో సైన్యం అప్రమత్తమైంది.

లోయలో స్కూల్స్ తెరిచినా, దుకాణాలు తెరిచినా.. తగలబెట్టేస్తాం అని పోస్టర్లు వెలవడంతో సైన్యం అప్రమత్తం అయ్యింది. పోస్టర్లు పెట్టిన వారిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కొంతమందిని అక్కడి పోలీసులు, సైన్యం అదుపులోకి తీసుకుంది.అనంతనాగ్ లోని ఆష్ ముఖం మార్కెట్లో దుకాణ దారులను ఉగ్రవాదులు బెదిరించారని, దుకాణాలు మూసెయ్యాలని లేదంటే తగలబెడతామని హెచ్చరించారని దుకాణదారులు చెప్తున్నారు. దీంతో సైన్యం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది.

మరోవైపు శ్రీనగర్ పరిసర ప్రాంతంలో దుకాణం తెరిచిన ఓ వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆ వ్యక్తి మరణించాడు. శ్రీనగర్లో ఉగ్రవాదులు ఉన్నారని తెలుసుకున్న సైన్యం నగరంలో ఆంక్షలు విధించి ఉగ్రవాదులకోసం ఆ ప్రాంతాలను జల్లెడ పడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -