Saturday, May 25, 2024
- Advertisement -

ఆస‌క్తిని రేపుతున్న నంద్యాల బైపోల్‌ బాబు మాటంటే లెక్క‌లేదు

- Advertisement -
bhuma akhila priya says out candidate will contest in nandyal byelection

నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు రాస్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకిత్తిస్తోంది. ఇప్ప‌టికే టికెట్ విష‌యంలో పార్టీలో గంద‌ర‌గోల ప‌రిస్తితి నెల‌కొంది. అయితే  బాబు మాత్రం దీనిపై వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే బాబు అనుమ‌తిలేకుండా మంత్రి అఖిల ప్రియ మాత్రం నంద్యాల ఉప ఎన్నికల అభ్య‌ర్తిపై  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

త‌న తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన నంద్యాల స్ధానం మాదే న‌ని మాకుంటుంబంనుంచే పోటీ చేస్తామ‌ని… ఇందులో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియా స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా వినే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. 

మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆమె బుధవారం భవానీ ఐల్యాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని, ఈ నెల 24వ తేదీన శోభా నాగిరెడ్డి వర్థంతి రోజున అభ్యర్థి ఎవరో ప్రకటిస్తామని తెలిపారు. 

ఇప్ప‌టికే ఈటికెట్టు విష‌యంలో పార్టీలో తీవ్ర పోటీ నెల‌కొంది. ఈ టికెట్టును ఆశిసిస్తున్న సీనియ‌ర్ నేత శిల్పా మోహ‌న్ రెడ్డి చివ‌రి వ‌ర‌కు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసినా చివ‌రికి  చేదు అనుభ‌వం ఎదురైంది. పార్టీ నియ‌మాల ప్ర‌కారం చ‌నిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబానికే టికెట్టును కేటాయిస్తున్న‌ట్లు బాబు తెల‌పండ‌తో శిల్పమోహ‌న్‌రెడ్డి ఒంట‌రిగా పోటీచేస్తాన‌ని లేకుంటే వైసీపీలోకి వెల్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో గంద‌ర‌గోలానికి తెర‌తీశారు. అయితే చంద్ర‌బాబు ఈస‌మ‌స్య‌ను ఎలా ప‌రిస్క‌రించాల‌నీ తిక‌మ‌క ప‌డుతున్న సంద‌ర్భంలో ఎలాగోలా  న‌చ్చ‌చెప్పి దారికి తీసుకొస్తున్న స‌మ‌యంలో భూమా అఖిల‌ప్రియ వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

అయితే ఇప్పుడు పార్టీలో భూమా అఖిల ప్రియ మాట‌లు పార్టీలో సంచ‌ల‌నంగా మారాయి. టీడీపీ నాయ‌కులంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. పార్టీ టికెట్ అభ్య‌ర్తిని ప్ర‌క‌టించేట‌ప్పుడు పార్టీ ఛేప్‌గానీ లేదా ఆయ‌న అనుమ‌తితో ప్ర‌క‌టింస్తారు. అయితే ఈ ప్రకటనను అఖిల… చంద్రబాబు నుంచి అనుమతి తీసుకునే చేశారా?  లేక తన మనసులోని భావనను చెప్పారా అన్న విషయం తెలియరాలేదు. పార్టీ అధిస్టానం అనుమ‌తిలేకుండా ఇటాంటి వ్యాఖ్య‌లు చేస్తారా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్తి విష‌యంలో పార్టీలో ఎవ‌రూ మాట్లాడ‌లేదు… మ‌రి అఖిల ప్రియ ఇంత డేర్‌గా త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డం చూస్తే అధిష్టానాన్ని లెక్క‌చేయ‌కుండా ఇలా మాట్లాడారాన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.మ‌రి ఈవ్యాఖ్య‌ల‌పై పార్టీ ల‌ధిస్టానం ఎలా  స్పందిస్తుందో…. లేక‌పోతే  ఈ వ్యాఖ్య‌లు పార్టీలో ఎలాంటి సంచ‌ల‌నాల‌కు కార‌నం అవుతాయే చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -