Monday, April 29, 2024
- Advertisement -

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేంద్రం తీపి క‌బురు..

- Advertisement -

కేంద్ర ప్ర‌భుత్వ ద్యోగుల‌కు కేంద్రం తీపిక‌బురు అందించింది. ఉద్యోగుల‌కు రెండు శాతం డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది . డీఏ పెంపు నిర్ణయం ఈ ఏడాది జులై 1 నుంచి వర్తింపచేస్తారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 7 శాతంగా ఉండింది. తాజాగా 2శాతం పెంచడంతో అది 9 శాతం అయ్యింది. మార్చిలో 5 శాతం ఉన్న డీఏను 2శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి వరకు 5శాతం ఉన్న డీఏ, పెంపుతో 7శాతానికి చేరుకుంది.

డీఏ, డీఆర్ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.6112 కోట్ల అదనపు భారం పడనుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు 62.03 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం క‌ల‌గ‌నుంది. ఏడో వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా డీఏ పెంపు నిర్ణయం తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -