Tuesday, May 7, 2024
- Advertisement -

మోగిన ఎన్నిక‌ల న‌గారా: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఏప్రిల్ 11 నుంచి దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 7 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. లోక్‌స‌భ‌తో పాటు నాలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రకటించింది.

పోలింగ్‌ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికల నిర్వహణ వంటి వివరాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్‌ అరోరా వెల్లడించారు. షెడ్యూలు ప్రకటించిన. మరుక్షణం నుంచి దేశవాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. 7 దశల్లో అంటె దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల హడావిడి ఉంటుంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 10 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 22 రాష్ట్రాల్లో ఒకే విడతలో లోక్‌సభ ఎన్నికలు ముగియనున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ తొలివిడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ : ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు దేశవ్యాప్తంగా 7విడతల్లో ఎన్నికలు ఓట్ల లెక్కింపు : మే 23

1) మొదటి విడత ఎన్నికలు: ఏప్రిల్ 11న 20రాష్ట్రాల్లోని 91నియోజకవర్గాలు
2)రెండవ విడత ఎన్నికలు: ఏప్రిల్ 18న 13రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాలు
3) మూడవ విడత ఎన్నికలు: ఏప్రిల్ 23న 14రాష్ట్రాల్లోని 115నియోజకవర్గాలు
4) నాలుగవ విడత ఎన్నికలు: ఏప్రిల్ 27న 9రాష్ట్రాల్లోని 71నియోజకవర్గాలు
5) ఐదవ విడత ఎన్నికలు: మే 6న 7రాష్ట్రాల్లోని 51నియోజకవర్గాలు
6) ఆరవ విడత ఎన్నికలు: మే 12న 7రాష్ట్రాల్లోని 59నియోజకవర్గాలు
7) ఏడవ విడత ఎన్నికలు: మే 19న 8రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -