Tuesday, May 7, 2024
- Advertisement -

కుక్క కనిపిస్తే కాల్చేస్తాం….చైనా క్లీన్ అండ్ గ్రీన్

- Advertisement -

కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో గల్ఫ్ దేశాలను … మన దాయాది దేశం  చైనా ఒక్కోసారి  అధిగమించేస్తుంటుంది.

రీసెంట్ గా తూర్పు చైనాలో ఓ జిల్లా ప్రభుత్వ విభాగం తాజాగా కుక్కులపై ఓ వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అక్కడ కుక్కల పెంపకాన్ని నిషేదిస్తూ ..ఇళ్లలో ఉన్న పెంపుడు కుక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించింది.ఈమేరకు షాన్ డాండ్ ప్రావిన్స్ డయాంగ్ జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ 10 లోగా ఆ జిల్లా లో ఉన్న కుక్కలన్నింటినీ తొలగించాలని ఆర్డర్ పాస్ చేసింది.ఒక వేల ఎవరైనా కుక్కలను ఇవ్వకుండా దాచి ఉంచినట్లయితే… ఇళ్లలోకి వచ్చి మరీ కాల్చేస్తామంటూ అధికార గణం హెచ్చరించింది.

ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పై  జంతు ప్రేమికులు ఎంతగానో నిరసన వ్యక్తం చేశారు.అయినప్పటికీ జిల్లా యంత్రాంగం ఈ నిరసనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.కుక్కల పెంపకంపై  లైసెన్స్ ఉన్నవారు  కూడా కుక్కలను స్వచ్చంగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదంతా  జిల్లాలో పరిశుభ్రత, ప్రజల శ్రేయస్సు కోసమే ఇలాంటి  చర్యలు చేపట్టినట్లు అక్కడి ప్రభుత్వం చెబుతుంది తప్ప… అంతకు మించి కారణాలు చెప్పకుండా ఇలా నిషేధం విధించడంతో స్థానికుల్లో తీవ్ర స్థాయిలో  వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అక్కడి ప్రజలు మాత్రం తమ ఇళ్లల్లోకి అధికారులకు వచ్చే  అధికారం ఏమాత్రం లేదని, తమ కుక్కలను వారు ఎలా చంపుతారో మేము చూస్తామని అధికారులకు హెచ్చిరకలు జారీ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -