Monday, April 29, 2024
- Advertisement -

ఏపీ మంత్రులను ఎన్ కౌంటర్ చేయండి!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి.

ప్రభుత్వంలోని పెద్దలు స్మగ్లర్లుగా అవతారం ఎత్తారని రఘువీరారెడ్డి దుమ్మెత్తిపోస్తున్నాడు. వీరు ఇసుక స్మగ్లింగ్ చేయిస్తున్నారని.. తద్వారా ప్రకృతి సంపదను దోచుకోవడంతో పాటు ఖజనాకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశాడు.
శేసాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీలను ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో.. ఈ ఇసుక స్మగ్లర్లను ఎందుకు వదిలపెట్టాలి? అంటూ రఘువీర ప్రశ్నించాడు. ఏపీ ప్రభుత్వానికి ఈ ఇసుక స్మగ్లర్లను ఎన్ కౌంటర్ చేసే దమ్ము ఉందా? అని ఆయన సవాల్ విసిరాడు. ఇసుక స్మగ్లింగ్ తో బాబు ప్రభుత్వంలోని మంత్రులకు ప్రమేయం ఉందని రఘువీరారెడ్డి ఆరోపించాడు.
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇసుకు అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశాడు. అయితే బాబు ప్రభుత్వానికి అంత దమ్ము లేకపోవచ్చని కూడా ఏపీ పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించాడు. బాబు ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని.. ప్రతి పనిలోనూ బాబు తనయుడు లోకేష్ కు వాటాలు అందుతున్నాయని రఘువీరారెడ్డి ఆరోపించాడు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచే లోకేష్ కోట్ల రూపాయలు సంపాదించాడని ఈయన అంటున్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -