Tuesday, April 30, 2024
- Advertisement -

ఫేస్‌బుక్ ప్రేమ‌తో పాక్ జైల్లో ఆరేండ్లు జైలు శిక్షఅనుభ‌వించిన సాఫ్ట్‌వేర్ యువ‌కుడు..

- Advertisement -

సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు, స్నేహాలుగా, ఆ తర్వాత ప్రేమగా మారడం, చివరకు క‌ష్టాలు ప‌డ‌టం లాంటి సంఘ‌ట‌న‌లు నిత్యం జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది. పేస్‌కుబ్‌లో ప్రేమించిన పాపానికి ప‌రాయి దేశం పాకిస్థాన్‌లో ఆరేండ్లు జైలుశిక్ష అనుభ‌వించాడు భార‌తీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌.మొత్తానికి ఆరేండ్ల జైలు శిక్ష అనుభవించిన ముంబై సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హమీద్ నీహాల్ అన్సారీ.. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవ, సహకారంతో ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు.

వివ‌రాల్లోకి వెల్తే…2012లో ఆన్ లైన్ లో పరిచయమైన పాకిస్థానీ అమ్మాయిని కలిసేందుకు అక్రమంగా ఆ దేశంలోకి చొరబడ్డ భారత జాతీయుడు హమీద్ నిహల్ అన్సారీకి ఆ దేశపు మిలిటరీ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్ష ఈ నెల 15 తో ముగిసింది. అతన్ని పాక్ నుంచి భారత్ కు తీసుకువచ్చేందుకు మన అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో నిన్న అత్తారి-వాఘా సరిహద్దులో హమీద్ నిహల్ అన్సారీని అప్పగించారు.

విడుద‌ళ‌యిన త‌ర్వాత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ను హమీద్ కుటుంబసభ్యులు ఈరోజు కలిశారు. హమీద్ కుటుంబసభ్యులకు సుష్మా స్వరాజ్ ఆత్మీయ స్వాగతం పలికారు. హమీద్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఫేస్‌బుక్‌లో ప్రేమించే యువ‌కుల‌కు సందేశం ఇచ్చాడు. త‌న అనుభ‌వాల‌ను మీడియాతో పంచుకున్నాడు.

సామాజిక మాధ్యమాల వేదికగా ఎవరూ కూడా ప్రేమలో పడొద్దు. రెండోది.. తల్లిదండ్రులకు అబద్దాలు చెప్పొద్దు. చివరిది తప్పుడు మార్గాన్ని ఎంచుకోవద్దు. తల్లిదండ్రులకు అబద్దాలు చెప్పడం వల్ల మనకు ఏమీ రాదు. మనకు ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులే అండగా నిలుస్తారు తప్ప వేరే వాళ్లు అండగా నిలువరు. మనం ఒక ప్రదేశం కానీ, ఇతర విషయాల్లో.. తప్పుడు మార్గం ద్వారా వెళ్లకూడదు అని అన్సారీ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -