Monday, April 29, 2024
- Advertisement -

ఎన్నిక‌ల ఫ‌లితాల మాదిరిగా షేర్ మార్కెట్ ఊగిస‌లాట‌

- Advertisement -
  • చివ‌రికి కోలుకున్న మార్కెట్‌, బ‌ల‌ప‌డిన రూపాయి

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు షేర్ మార్కెట్‌ను షేక్ చేశాయి. ఫ‌లితాల మాదిరి ఊగిస‌లాడాయి. కొద్దిసేపు అట్టడుగు స్థాయికి మ‌రోస్థాయి పైకి ఎగ‌బాకి ఇలా ఎన్నిక‌ల ఫ‌లితాల మాదిరి ఊగిస‌లాడింది. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి మార్కెట్ లాభాలా? న‌ష్టాలా అని న‌డుస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్న బీజేపీ గెలుస్తుందా? ల‌ఏదా అనే దానిపై షేర్ మార్కెట్ సోమ‌వారం (డిసెంబ‌ర్ 18) రోజు ఆధార‌ప‌డి ఉంది. హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ ఫ‌లితం క‌న్నా గుజ‌రాత్ రాష్ట్ర ఫ‌లితంపై మార్కెట్ క‌న్నేసింది.

గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. క్షణక్షణానికి మారుతున్న ఫలితాల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ఫ‌లితాల లెక్కింపు ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంద‌ని తెలియ‌డంతో మార్కెట్ కూడా ప్రారంభంలో కుదేలైంది. ఆ త‌ర్వాత బీజేపీ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించి విజ‌యం దిశ‌గా వెళ్ల‌గా సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. అటు రూపాయి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఫలితాల నేపథ్యంలో పడుతూ లేస్తూ సాగుతోంది.

రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్‌ పోల్స్ శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 15)న వెల్ల‌డించారు. అప్పుడు ట్రేడింగ్‌లో రూపాయి మారకం విలువ మూడు నెలల గరిష్ఠానికి పెరిగి రూ.64.04 గా ముగిసింది. అయితే సోమవారం మార్కెట్ ప్రారంభమైన సమయంలో గుజరాత్‌లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీగా పోటీ సాగ‌డంతో రూపాయి విలువ భారీగా పతనమైంది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 68 పైసలు పడిపోయి రూ.64.72 వద్ద ట్రేడ‌య్యింది. అయితే ఆ తర్వాత భాజపా పుంజుకోవడంతో రూపాయి కూడా కాస్త బలపడింది. ప్రస్తుతం రూ. 64.12 వ‌ద్ద స్థిరంగా కొనసాగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -