Thursday, May 2, 2024
- Advertisement -

అవినీతి ఆరోప‌న‌ల‌తో ఉక్కిబిక్కిరి అవుతున్న ఢీల్లీ సీఎం కేజ్రీవాల్‌….

- Advertisement -
Subramanian Swamy letter to delhi LG of delhi cm kejriwal wal corruption

ఆప్ క‌న్వీన‌ర్ …ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై వ‌స్తున్న ఆరోప‌న‌లు ఆయ‌న‌కు కంటిమీద కునులేకుండా చేస్తున్నాయి. మ‌రో వైపు ఆప్ పార్టీలో తిరుగుబాటు దారులు కేజ్రీకి చుక్క‌లు చూపిస్తున్నారు.

తన కళ్ల ముందే సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్లు లంచాన్ని కేజ్రీవాల్ తీసుకున్నారంటూ ఆప్ నేత, మంత్రి కపిల్ మిశ్రా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మరో అవినీతి ఆరోపణను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ఈ ఆరోప‌న‌లు సంచ‌ల‌నంగా మారాయి.
కొంత‌కాలంగా ఆప్ పార్టీలో చెలరేగిన సంక్షోభం కీలక మలుపు తిరిగింది. కేజ్రీవాల్‌పై వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏసీబీ విచారణకు ఆదేశించారు.దీంతో ఊరుకోకుండా తిరుగుబాటు నేత క‌పిల్ మిశ్రా ఆధారాల‌తో సీబీఐని క‌లుస్తాన‌ని సంచ‌లన ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో కేజ్రీ దిక్కుతోచ‌ని స్థితిలో ఉంటే మ‌రో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు.
కేజ్రీవాల్ ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి రెండు కోట్లు లంచం తీసుకున్నారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్ లంచం తీసుకున్నారని, ఆయన అవినీతిపై విచారణ చేపట్టాలని తన లేఖలో స్వామి డిమాండ్ చేశారు.ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైర‌ల్‌గా మారింది.

{loadmodule mod_custom,Side Ad 1}
లేఖ‌లో రూ.50 లక్షల చొప్పున నాలుగు దఫాలుగా కేజ్రీవాల్ ఆ నగదును తీసుకున్నారని ‘క్విడ్ ప్రొకో’లో భాగంగా అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. గతంలోనే ఢిల్లీ ఎల్జీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లానని, విచారణకు ఆదేశించని కారణంగా ఈసారి లేఖాస్త్రం సంధించినట్లు వివరించారు. కేజ్రీవాల్‌పై చేసిన ఆరోపణలకుగానూ తనవద్ద సాక్ష్యాలు ఉన్నాయని, ఎల్జీ విచారణకు ఆదేశిస్తారని సుబ్రమణ్యస్వామి ఆశాభవం వ్యక్తంచేశారు. ఇప్ప‌టికే క‌పిల్‌మిశ్రా చేసిన ఆరోప‌న‌ల‌మీద విచార‌న‌కు ఆదేశించిన గ‌వ‌ర్న‌ర్ ఇప్పుడు సుబ్ర‌మ‌ణ్య‌స్వామిలేఖ మీద ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని చ‌ర్చ కొన‌సాగుతోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -