Tuesday, April 30, 2024
- Advertisement -

చావు బ్ర‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న జైసేమ‌హ‌మ్మ‌ద్ ఛీఫ్..

- Advertisement -

భారత్ లో ఎన్నో ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ తీవ్ర అనారోగ్యంతో చావు బ్ర‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న‌ట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో దీంతో గత కొన్ని రోజులుగా తను మంచానికే పరిమితమైనట్టు భారత నిఘా వర్గాల సమాచారం.

సొంతూరుతోపాటు పాకిస్థాన్‌లోని అతడెక్కడా కనిపించడం లేదు. దీంతో అతడి కోసం ఆరా తీయగా.. గత ఏడాదిన్నరగా అతడు మంచానికే పరిమితమయ్యాడని ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది. జైషే మహ్మద్ బాధ్యతలను అతడి తమ్ముళ్లయిన రవూఫ్ అస్ఘర్, ఆథర్ ఇబ్రహీం పర్యవేక్షిస్తున్నారు.

వెన్నెముక, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో మసూద్ బాధపడుతున్నాడని, రావల్పిండిలోని ఓ మిలిటరీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని సమాచారం. 2001లో పార్లమెంట్‌పై దాడితోపాటు.. 2005లో అయోధ్యపై దాడి, రెండేళ్ల క్రితం పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడిలోనూ మసూద్ అజహరే ప్రధాన సూత్రధారి. అతణ్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఇండియా, అమెరికా ఐరాసలో ప్రయత్నిస్తుండగా.. చైనా మోకాలడ్డుతున్న సంగతి తెలిసిందే.

మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌కు చైనా ససేమీరా అంటోంది. రకరకాల డిమాండ్లు మన ముందు పెడుతోంది. ఇకపై డ్రాగన్ డిమాండ్లకు భారత్ అంగీకరించాల్సిన అవసరం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -