Thursday, May 2, 2024
- Advertisement -

సోనియా – కోదండరాం కలిసి ఏం చేసారు

- Advertisement -
Kodanda Meet Sonia

ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించే కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మరోమారు తనదైన శైలిలో అధికార టీఆర్ ఎస్ పార్టీని ఇరుకునపెట్టారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం కలువడంపై అధికార టీఆర్ ఎస్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందిస్తూ ఈ విషయంలో టీఆర్ ఎస్ నేతలు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని కోదండరాం కలిస్తే తప్పేమిటనీ  ప్రశ్నించారు. సోనియాను ఎవరైనా కలువవచ్చునని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా – ఎంపీగా ఉన్న సోనియా గాంధీ నిషేధిత సంస్థ అధ్యక్షురాలేమి కాదని ఆమె ఆమెను ఎవరైనా కలువచ్చునని పొంగులేటి స్పష్టం చేశారు. సోనియాను కోదండరాం కలిశారంటూ టీఆర్ ఎస్ ఆరోపణలు చేయడం అర్థం లేని ప్రయత్నం అంటే ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని ఎవరైనా కలుస్తారనీ ఆ మాటకొస్తే  టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి ఆమెను కలిశారని పొంగులేటి గుర్తు చేశారు.

సోనియాను కోదండరాం కలిస్తే  మర్యాదపూర్వకంగా కలిశారని భావించకుండా రాజకీయ ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. సోనియా అంగీకారంతో రాష్ట్రం ఏర్పాటవడం వల్లే రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. ప్రజల ఆకాంక్షను గమనించి రాష్ట్రం ఏర్పాటుచేసినందుకు సోనియాను కలవకూడా అంటూ పొంగులేటి నిలదీశారు. తన టీఆర్ ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాట ఇచ్చి తప్పిన కేసీఆర్ కు మర్యాదరపూర్వకంగా కలిసిన కోదండరాంపై విమర్శలు ఎలా చేయాలని అనిపిస్తోందని పొంగులేటి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఎప్పటికైనా ప్రధాన ప్రత్యర్థిగా తనను గద్దె దింపుతుందనే భయంతోనే కేసీఆర్ ఈ రకంగా అడ్డగోలు విమర్శలు చేయిస్తున్నారని పొంగులేటి ఫైర్ అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -