Monday, April 29, 2024
- Advertisement -

దేశంలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా..

- Advertisement -

గత నెలలో దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. వరుసగా నాల్గో రోజు మూడు లక్షల లోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. తాజాగా నమోదవుతున్న కేసులు రోజురోజుకు తగ్గుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య ఆందోళన క‌లిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,81,386 మంది కరోనా బారినపడినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం ఉదమం మీడియాకు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 3,78,741 మంది కరోనా నుంచి కోలుకున్నారని, 4,106 మంది కరోనాతో చనిపోయారని అధికారులు వెల్లడించారు.

మహమ్మారి ధాటికి మరో 4,106 మంది ప్రాణాలు విడిచారు. భారత్ లో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసులు 2,49,65,463కు పెరిగాయని, ఇప్పటివరక 2,11,74,076 మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు చెప్పారు. ప్రస్తుతం 35 లక్షలకుపైగా యాక్టివ్‌ కేసులున్నాయని వారు పేర్కొన్నారు. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటివరకు 18.29 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వివ‌రించింది.

ఆదివారం టెస్టుల‌ సంఖ్యలో తగ్గుదల కూడా పాజిటివ్ కేసుల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది.స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు తెలిపారు. అత్యవసర పనులు ఉంటేనే రోడ్ల మీదకు రావాలని, రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలను కోరారు. కేంద్రం విధించిన కరోనా నిబంధనలను విధిగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు పై అసలు కుట్ర ఎక్కడ జరుగుతుంది..?

బుల్లితెరపై టాప్ 5 యాంకర్స్ వీళ్ళే!

ఒక్క విజయం కోసం వెయిట్ చేస్తున్న స్టార్ హీరోలు వీళ్ళే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -