Monday, April 29, 2024
- Advertisement -

సరిహద్దుల్లో ఏకే-47 ను ఎక్కుపెట్టిన ధోని….

- Advertisement -

ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడంతో పేవల ప్రధర్శన చేసి ధోని మీద తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసందే. ధోని రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చిందని మాజీ క్రికెటర్లతో పాటు అన్ని వర్గాలనుంచి విమర్శలు వచ్చాయి. వెస్టిండీస్ టూర్ కు వెళ్లకుండా కశ్మీర్ లోయలో సైనిక విధులకు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. ధోనీ పారామిలిటరీ రెజిమెంట్ లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో అధికారిగా కొనసాగుతున్నాడు.

జమ్మూకశ్మీర్ లో విధులు నిర్వర్తించేందుకు వెళ్లగా, ఆ సమయంలోనే ఆర్టికల్ 370 రద్దుతో పాటు రాష్ట్ర విభజన కూడా జరిగింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కూడా ధోనీ దక్షిణ కశ్మీర్ లో విధుల్లో కొనసాగారు. లడఖ్ ను కేంద్ర ప్రాలిత ప్రాంతంగా ప్రకటించడంతో ధోని అక్కడకు వెళ్లారు.

లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోనీ లద్దాఖ్‌లో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నాడు. లద్దాఖ్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో ధోనీ బుధవారమే అక్కడికి చేరుకున్నాడు. ఇందులో భాగంగా లద్దాఖ్‌లోని ఆర్మీ ఆసుపత్రిని సందర్శించాడు. అక్కడి సిబ్బంది, సైనికులతో కొద్దిసేపు ముచ్చటించాడు.

అంతేకాదు, షూటింగ్ రేంజ్ లో సహచరులతో కలిసి ఏకే-47, ఇన్సాస్ వంటి రైఫిళ్లను ఎక్కుపెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -