Friday, April 26, 2024
- Advertisement -

ఈటల రాజేందర్‌పై మావోయిస్టు నేత ఘాటు లేఖ

- Advertisement -

తెలంగాణలో గత కొన్ని రోజులుగా రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మొన్న ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతల సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఘాటు లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీమంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను తెలంగాణ మావోయిస్టు పార్టీ ఖండించింది.

ఈటల రాజేందర్ తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ.. కేసిఆర్ కు వ్యతిరేకంగా పోరాడ‌తాన‌ని చెప్పాడని.. కాని దానికి విరుద్దంగా హిందుత్వ పార్టీ బీజేపీలో చేరారని మండిపడింది. అంతే కాదు ఇది సీఎం కేసీఆర్‌కు ఈటలకు మధ్య జరుగుతున్న పోరాటమని.. దీంతో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖలో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. కెసిఆర్ ,ఈటెల రాజేందర్ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారని మావోయిస్టు పార్టీలో లేఖలో ప్రస్తావించింది.

మొన్నటి వరకు కెసిఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటెల తన ఆస్తుల పెంపునకు ప్రయత్నించాడని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖలో ఆరోపించారు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించారన్నాడు. కెసిఆర్ బర్రెలు తినేవాడు అయితే ఈటెల రాజేందర్ గొర్రెలు తినే ఆచరణ కొనసాగించాడన్నారు.

తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని ప్రకటిస్తూ తన ఆస్తుల రక్షణ కోసం బీజేపీలో చేరారని విమర్శించారు. ఈటల తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసం అని లేఖలో జగన్ పేర్కొన్నారు.

విశాఖలో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

లోకేష్ బాబు ముద్ద పప్పు.. అందరూ ఆయనలా కావాలా? : ఎమ్మెల్యే రోజా ఫైర్

హుజూర్ నగర్ పర్యటనలో వైఎస్ షర్మిలకు షాక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -