Monday, April 29, 2024
- Advertisement -

ఎఫ్​డీఏ కోసం మోడెర్నా తిప్పలు..!

- Advertisement -

మోడెర్నా సంస్థ రూపొందించిన వ్యాక్సిన్ క్యాండిడేట్ mRNA-1273 అత్యవసర వినియోగానికి అతిత్వరలోనే అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) అనుమతులు ఇవ్వనుంది. ఈ మేరకు నిపుణులతో కూడిన ఎఫ్డీఏ సలహా కమిటీ.. టీకా ఆమోదం కోసం సిఫార్సు చేసింది. ఎఫ్డీఏ- వ్యాక్సిన్లు, జీవఉత్పత్తుల సలహా కమిటీ సభ్యుల్లో 20-0 ఓట్లతో టీకాకు గ్రీన్సిగ్నల్ లభించింది. ఈ నేపథ్యంలో.. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అతి త్వరలోనే తుది అనుమతులు ఇచ్చే దిశగా ప్రయత్నిస్తామని ఆహార, నియంత్రణ సంస్థ కమిషనర్ స్టీఫెన్ హాన్ తెలిపారు.

ఇప్పటికే మోడెర్నా క్లినికల్​ ట్రయల్స్​లో సురక్షితమైంది, సమర్థమైందని తేలింది. నవంబర్​ 30న ప్రకటించిన ఫలితాల్లో.. టీకా 94.1 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని మోడెర్నా స్పష్టం చేసింది. ప్రతికూల ప్రభావం లేదని నిర్ధరించింది.

ఎఫ్​డీఏ అనుమతులు లభిస్తే.. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభిస్తామని మోడెర్నా సీఈఓ స్టీఫెన్​ బన్సల్​ స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -