Wednesday, May 8, 2024
- Advertisement -

అది హిందూ ఆలయాల గొప్పదనమా..!

- Advertisement -

భూకంపం నేపాల్ కు అత్యంత దుర్భరమైన అనుభవాలను మిగిల్చింది. ఈ హిమాలయన్ కంట్రీ ఈ భూకంపం ప్రభావం నుంచి ఎన్నటికి కోలుకొంటుంది? అనేది ఇప్పుడప్పుడే చెప్పలేని అంశం.

అత్యంత భారీ జననష్టాన్ని మిగిల్చిన భూకంపంతో భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే ప్రజలే ఎక్కువమంది ఉండే ఆదేశంతో వారంతా మూకుమ్మడిగా నష్టపోయారు. వారిలో ఇప్పుడు ఎలాంటి తేడాలూ లేవు. అందరూ తమకున్నవాటన్నింటినీ కోల్పోయారు.

ఎలా కోలుకోవాలో తెలియని దశలో ఉన్నారు. ఈ భూకంపంలో భారీ నిర్మాణాలు కూడా కుప్పకూలాయి. సామాన్యుల ఇళ్లు అయినా.. చరిత్ర ఉన్న నిర్మాణాలు అయినా భూకంపానికి తేడా లేదు కదా! అన్నింటినీ కుప్పకూల్చేసింది. ఈ విపత్తులో ఎంతో చరిత్ర ఉన్న భీమ్  సేన్ టవర్స్ కుప్పకూలింది. ఒకనాడు రాజరికంలో ఉన్న ఈదేశంలో ఆ టవర్స్ నిర్మాణం జరిగింది. దానికి దాదాపు రెండువందల సంవత్సరాల చరిత్ర ఉంది. అలాంటి నిర్మాణం  ఈ భూకంపం ధాటికి తట్టుకోలేకపోయింది.

అయితే ఇంత తీవ్రమైన భూకంపంలోనూ కట్మాండులోని పశుపతి నాథ ఆలయం దెబ్బతినకపోవడం విశేషం. దాదాపుగా నేపాల్ రాజధాని నేలమట్టం అయిన నేపథ్యంలో కూడా పశుపతి నాథ ఆలయం ఠీవీగా ఉంది. ఇది ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆలయం. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేపాల్ పర్యటనలో కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకొన్నారు. ఇంకా అనేకమంది హిందువులు ఈ ఆలయ దర్శనానికి వెళ్లేవాళ్లు. మరి ఇప్పుడు కూడా ఆలయం దర్జాగా ఉండటం భక్తులను అమితానంద పెట్టే అంశం అవుతోంది. హిందూ ఆలయాలు నిర్మాణాత్మక నైపుణ్యాలతో నిర్మించబడి ఉంటాయని.. అందుకే ఇంత భూకంపంలోనూ ఆ ఆలయం చెక్కు చెదరలేదని నిపుణులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -