Monday, April 29, 2024
- Advertisement -

త‌లొగ్గిన పాక్‌ : వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్‌ను రేపు విడుద‌ల‌ చేయ‌నున్న పాక్‌..

- Advertisement -

పాకిస్థాన్‌పై భార‌త దౌత్యం ఫ‌లించింది. పాక్ పై ఒత్తిడి తీసుకురావ‌డంతో భార‌త్ ఫ‌లితాలు ఫ‌లించాయి. అంత‌ర్జాతీయంగా వ‌స్తున్న ఒత్తిడుల‌ను త‌ట్టుకోలేని పాక్ ఎట్ట‌కేల‌కు వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్‌ను రేపు విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌క‌టించారు. అభినంద‌న్‌ను విడుద‌ల‌ చేయాలంటే భార‌త్ చ‌ర్చ‌ల‌కు రావాల‌ని కొద్ది సేప‌టిక్రిత‌మే పాక్ విదేశాంక ప్ర‌క‌టించింది. జెనీవా ఒప్పందంలో భాగంగా త‌మ పైలెట్‌ను విడుద‌ల‌ చేయాల్సిందేనని ఎటువంటి చ‌ర్చ‌లు ఉండ‌వ‌ని భార‌త్ ప్ర‌క‌టించిన కొద్ది సేప‌టికే పాక్ వింగ్ క‌మాండ‌ర్‌ను విడుద‌ల‌ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.దీంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది.

అంత‌ర్జాతీయంగా పాక్‌పై ఒత్తిడి ఫ‌లించ‌డంతో వెంట‌నే పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ పార్ల‌మెంట్‌లో అధికారిక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం వద్దని తాము శాంతిని కోరుకుంటున్నామ‌ని ఈ స‌సంద‌ర్భంగా తెలిపారు. మోదీతో చ‌ర్చించేందుకు ప్ర‌ధాని మోదీకి ఫోన్ చేశాన‌ని కాని అది కుద‌ర‌లేద‌న్నారు.

చర్చల్లో భాగంగా తొలి అడుగు వేసేందుకు పాకిస్థాన్ కస్టడీలో ఉన్న భారత వింగ్ కమాండర్‌ను అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.జెనీవా ఒప్పందం ప్రకారం ఓ యుద్ధ ఖైదీతో గౌరవంగా వ్యవహరించాలి. ఈ క్రమంలో పాక్ కూడా అభినందన్ వర్థమాన్‌ను వెనక్కి అప్పగించేందుకు రెడీ అయింది. భారత భూభాగంలో దాడి చేయడానికి వచ్చిన పాకిస్థాన్ ఫైటర్ జెట్లను మిగ్ 21లో తరిమికొట్టేందుకు వెళ్లాడు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ అక్క‌డి ఆర్మీ అదికారులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -