Thursday, May 2, 2024
- Advertisement -

పాక్.. చైనా మధ్య రుణ ఒప్పందం..!

- Advertisement -

పాకిస్థాన్​ రైల్వే ప్రాజెక్ట్ కోసం​ ఇచ్చిన 6 బిలియన్​ డాలర్ల రుణానికి.. చైనా అదనపు హామీలు కోరినట్లు వస్తున్న వార్తలపై ఆ దేశం స్పందించింది. ఇరుదేశాల మధ్య నిర్మిస్తున్న సీపెక్​(చైనా-పాక్​ ఆర్థిక నడవా)కు బీజింగ్​ సమకూరుస్తానన్న 60 బిలియన్ల డాలర్ల రుణాల వాగ్దానం సైతం నేరవేరుస్తామని స్పష్టం చేసింది. వీటికి వ్యతిరేకంగా వచ్చిన నివేదికలన్నీ అవాస్తమని చైనా విదేశాంగ ప్రతినిధి ​ఝావో లిజియాన్​ తెలిపారు.

ఈ ఆర్థిక నడవా బలూచిస్థాన్, పాకిస్థాన్​లోని గ్వదార్​ పోర్ట్ నుంచి చైనాలోని గ్జింగ్జాంగ్​ ప్రావిన్స్​ వరకు నిర్మిస్తున్నారు. ఇది పాక్​ ఆక్రమిత కశ్మీర్​ మీదుగా వెళ్తున్నందున ఈ ప్రాజెక్టుకుపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా.. సీపెక్​తో సహా రోడ్​ అండ్​ బెల్ట్​ ఇన్షియేటివ్​(బీఆర్​ఐ)లకు నిధుల మంజూరులో జాప్యం జరిగింది. అంతేకానీ రుణాల విషయంలో వెనక్కి మాత్రం తగ్గదిలేదు. మొదటి మూడు త్రైమాసికాలలో బీఆర్​ఐ దేశాలలో 30 శాతం నిధులను పెట్టుబడిగా పెట్టాము అని అన్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -