Monday, April 29, 2024
- Advertisement -

ఇమ్రాన్ ఖాన్ ప్ర‌మాణ‌స్వీకారానికి ఇదేశీనేత‌లను పిల‌డంలేదు..

- Advertisement -

పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ఈనె 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు భారత ప్రధాని మోదీ సహా సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానిస్తారని తొలుత వార్తలు వెలువడ్డాయి. దీంతో ప్రధాని మోదీని కూడా ఆహ్వానిస్తారా..? ఇమ్రాన్ ఆహ్వానాన్ని భారత ప్రధాని మన్నిస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ విదేశీ నేతలను ఎవర్నీ ఈ అయితే, విదేశీ నేతలు ఎవరినీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడం లేదని ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధికార ప్రతినిధి ఫవాద్ ఛౌదరి స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పారు. దేశాధ్యక్షుడి అధికార నివాసంలో చాలా సింపుల్ గా ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానించినా.. ఆయన రాకపోవచ్చని పాక్ వర్గాలు భావించినట్టు టాక్. ఆయన్ను ఆహ్వానించి, తీరా రాకపోతే అవమానం. అందుకే సార్క్ దేశాల అధినేతలను పిలిచే ఆలోచనను నుంచి పాక్ విరమించుకుందని ప్రచారం జరుగుతోంది.

ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమీర్ ఖాన్‌లకు ఆహ్వానం అందింది. తాను పాకిస్థాన్ వెళ్తున్నట్టు సిద్ధూ ఇప్పటికే తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -