Wednesday, May 1, 2024
- Advertisement -

సామాన్యుడిపై పడిన భారం

- Advertisement -

పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గడచిన ఆరు వారాల్లో ఇలా పెరగడం ఇది నాలుగో సారి. ఈసారి పెట్రోలు కంటే డీజిల్ ధరలే ఎక్కువ పెరగడం విశేషం. డీజిల్ ధరను 1.26 పైసలు పెంచిన ప్రెట్రో సంస్ధలు పెట్రోలుపై మాత్రం ఐదు పైసలు మాత్రమే పెంచడం విశేషం. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్ లో పెట్రోలు ధర పన్నులతో కలిపి 7 పైసలు పెరిగి లీటర్ 69.98 రూపాయలకు చేరింది.

ఇక డీజిల్ ధర విషయానికొస్తే 1.36 రూపాయలు పెరిగి 60.08 రూపాయలకు చేరుకుంది. డాలర్ తో రూపాయి మారకం విలువలో వచ్చిన వ్యత్యాసం, విదేశీ చమురు మార్కెట్ లో వచ్చిన మార్పులతో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచాల్సి వచ్చిందని ఐవోసి తెలిపింది. ఈ ధరల పెరుగుదల మార్చి 17 నుంచి కొనసాగుతూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా డీజిల్ పై 11.05 రూపాయలు పెరగింది. ఇక పెట్రోలు ధర 9.04 రూపాయలు పెరిగింది. ఈ ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -