Tuesday, April 30, 2024
- Advertisement -

ఆయన వ్యాపారాలతో మోడీకి తలనొప్పి..?!

- Advertisement -

భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ పై ఇప్పటికే కొన్ని వివాదాలున్నాయి. ఆయనకు చాలా వ్యాపారాలున్నాయని..ఆయనది పెద్ద వ్యాపార సామ్రాజ్యమని వార్తలు వచ్చాయి.

ఈ కమలనాథుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి వాళ్లతో కలిసి వ్యాపారాలు చేస్తున్నాడని గతంలో విమర్శలు వచ్చాయి. అయితే వాటిని గడ్కరీ ఖండించాడు. అయితే ఆ మరక మాత్రం అలాగే ఉండిపోయింది.
మరి ఆ సంగతి అలా ఉంటే.. ఇప్పుడు గడ్కరీకి సంబంధించి మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఆయన వ్యాపార సంస్థలు అక్రమంగా ప్రభుత్వ  వ్యవస్థల నుంచి రుణాలు పొందాయనేది ఈ ఆరోపణ. జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ నుంచి గడ్కరీ వ్యాపార సంస్థలకు అక్రమంగా 84 కోట్ల రూపాయల రుణాలు మంజూరు అయ్యాయని కాగ్ పేర్కొంది.
మరి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను సమీక్షించే కాగ్ తన నివేదికలో ఈ విషాన్ని పేర్కొనడంతో  బీజేపీకి ఇబ్బందిగా మారింది. భారతీయ జనతా పార్టీ నేతలు.. అధికారాన్ని చేతుల్లో పెట్టుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ విషయంలో విపక్షాలు కూడా రెచ్చిపోతున్నాయి. మోడీ సర్కారుపై పార్లమెంటులోవిమర్శల వాన కురిపిస్తున్నాయి.
తాము వ్యక్తిగత ఆరోపణలు చేయడం లేదని.. కాగ్ నివేదికనే ఆధారంగా చూపుతున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో మోడీ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. ఈ విధంగా గడ్కరీ వ్యాపారాలు మోడీ సర్కారుకు తలనొప్పిగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -