Thursday, May 9, 2024
- Advertisement -

పంచాయ‌తీ స‌మ‌రం: అభ్య‌ర్థుల‌ గుర్తులు ఇవే!

- Advertisement -

ఎన్నిక‌ల క‌మిష‌న్ వ్య‌వహార‌శైలిపై విమ‌ర్శ‌లు, ప్రజారోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకుని వాయిదా వేయాల‌ని ప్ర‌భుత్వం భావించ‌డం.. సుప్రీంకోర్టు ఆదేశాలు, రాజ్యాంగ‌బ‌ద్ధ వ్య‌వ‌స్థ‌కు క‌ట్టుబ‌డి ఎట్ట‌కేల‌కు గ‌వ‌ర్న‌మెంటు అంగీక‌రించ‌డంతో ఆంధ్రప్రదేశ్ పంచాయ‌తి ఎన్నిక‌ల‌కు న‌గారా మోగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నామినేష‌న్ల ప్ర‌క్రియ అనంత‌రం ఫిబ్ర‌వ‌రి 9న‌ తొలివిడత పంచాయతీ ఎన్నికలు జ‌రుగనున్నాయి. మొత్తం నాలుగు ద‌శ‌ల్లో నిర్వ‌హించే ఈ పార్టీ ర‌హిత ఎన్నిక‌ల్లో, అభ్యర్థులకు కేటాయించే గుర్తులను ఎన్నికల సంఘం విడుద‌ల చేసింది.

మొద‌టి ద‌శ పోలింగ్‌లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి 25 గుర్తులు, వార్డు మెంబర్లకు 20 గుర్తులను కేటాయించింది. సర్పంచ్గా పోటీ చేయాల‌న‌కునే వారికి నల్లబోర్డు, కప్పుసాసరు, కత్తెర, ఉంగరం, క్యారెట్‌, తాళం చెవి, మొబైల్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్ష, తిరగలి, కుండ, అరటిపండు, గొలుసు, కుర్చీ, బ్యాట్‌, మంచం, బుట్ట, వంకాయ, కొవ్వొత్తులు, అనాసపండు, షటిల్‌, చేతికర్ర, చెంచా తదితర గుర్తులను కేటాయించింది.

ఇక వార్డు మెంబర్ అభ్యర్థులకు ఎలక్ట్రిక్ ‌స్తంభం, బెండకాయ, కుక్కర్‌, ఐస్ ‌క్రీమ్‌, కెటిల్‌, ఐర‌న్ బాక్్స‌‌, పోస్టుడబ్బా, గ్యాస్‌ పొయ్యి, గౌను, స్టూలు, వయొలిన్, బీరువా, కటింగ్ ప్లేయర్‌, గరిట, బెల్టు, కోటు, డిష్‌ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారంబోర్డు వంటి గుర్తులు ఖ‌రారు చేసింది. అంతేకాదు, ప్రతి బ్యాలెట్ పేపర్ చివర నోటా గుర్తు కూడా ఉంచ‌డం గ‌మ‌నార్హం.

సీనియర్‌ సిటిజన్లకు శుభవార్త

పవన్ తో మూవీ.. సాయి పల్లవి పారితోషికం ఎంతో తెలుసా?

బాబోయ్‌.. అనసూయ డిమాండ్‌ మాములుగా లేదుగా..

అందుకే నువ్వు గ్రేట్ ర‌హానే.. హ్యాట్సాఫ్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -