Saturday, April 20, 2024
- Advertisement -

ఇక మాతృ భాషలో బీటెక్ చదువు..!

- Advertisement -

దేశంలోని ఐఐటీ ( ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ), ఎన్​ఐటీ (నేషనల్​ ఇన్​స్టిస్టూట్​ ఆఫ్​ టెక్నాలజీ)ల్లో వచ్చే విద్యా సంవత్సరం 2021-22 నుంచి ఇంజినీరింగ్​ కోర్సులను మాతృభాషలో బోధించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ అధికారవర్గాలు తెలిపాయి.

విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నేతృత్వంలో గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాతృ భాషలో ఇంజినీరింగ్ బోధనపై నిర్ణయం తీసుకున్నారు.

పాఠశాల విద్యాబోర్డుల ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసిన తర్వాత.. పోటీ పరీక్షల కోసం సిలబస్​ను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ రూపొందిస్తుందని నిర్ణయించారు అధికారులు. అలాగే విద్యార్థులకు అందాల్సిన ఉపకార వేతనాలు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అందుకోసం ప్రత్యేక హెల్ప్​లైన్​ ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల సమస్యలను త్వరితగతంగా పరిష్కరిస్తామని భరోసా కల్పించిట్లు చెప్పారు.

ఆర్ఆర్ఆర్ లో చిరంజీవి వాయిస్ ఓవర్..!

ఆచార్య షూటింగులో రామ్ చరణ్ ఎప్పుడంటే..?

మహేష్ బాబు సీక్రెట్స్ బయటపెట్టిన మంజుల..

రిచా సినిమాలకు ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -