Saturday, April 20, 2024
- Advertisement -

ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.. అక్కడ ఆడితే జైలుకే..!

- Advertisement -

ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం విధించింది తమిళనాడు ప్రభుత్వం. ఇప్పటినుంచి ఎవరైనా ఆన్​లైన్​ రమ్మీ ఆడితే ఆరునెలల పాటు జైలు శిక్ష, రూ. 5వేలు జరిమానా విధించనుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ హౌస్‌ నడిపితే రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఆటలో డబ్బు కోల్పోయిన అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ శుక్రవారం ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు.

ఆన్‌లైన్‌ రమ్మీకి ప్రచారం చేసినందుకు ఇటీవల క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, సౌరభ్‌ గంగూలీ, నటులు ప్రకాష్‌రాజ్‌, సుదీప్‌, రానా, తమన్నాలకు మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ సమాధానం చెప్పాలని ఆదేశించింది.

టీఆర్​పీ లోల్లిలో మొత్తం 12 మంది..!

చైనా పై గురి పెట్టిన బైడెన్ ..!

కరోనా వచ్చింది… ఉరిశిక్ష తప్పింది..!

ఆ గ్రామంలో అందరికీ కరోనా.. కానీ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -