Sunday, April 28, 2024
- Advertisement -

ఢిల్లీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదు

- Advertisement -

దేశంలో రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ పోతున్నాయి. మొన్న కర్నాటక రాష్ట్రంలో రెండు ఒమెక్రాన్ కేసులు భయటపడగా.. నిన్న గుజరాత్‌, మహారాష్ట్రలో రెండు కేసులు నమోదుయ్యాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఒమెక్రాన్‌ కేసు నమోదైంది.

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆహమ్మారి మాత్రం ఆగడంలేదు. ప్రజలు మాస్క్‌లు, శానిటైజర్లు వాడుతాన్నా కోవిడ్‌ కొత్త వేరియండ్‌ విజృంభిస్తునే ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగవచ్చనే అనుమానంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వారిని గుర్తించి వారికి కోవిడ్‌ టీకా వేయించే పనిలో నిమగ్నమైంది. దీంతో పాటు దేశ వ్యాప్తంగా మరోసారి సానిటైజేషన్‌ చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది.

ఢిల్లీలో ఒమెక్రాన్‌ కేసు నమోదవ్వడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ సొకిన వ్యక్తిని ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచిన ఆరోగ్యశాఖ రోగికి చికిత్స అంధిస్తున్నారు. ఢిల్లీలో ఒమెక్రాన్‌ చాపకింద నీరులా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో కేజ్రివాల్‌ ప్రభుత్వం లాక్‌ డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ధైర్యంగా థియేటర్లలో సినిమా చూడవచ్చు..

10 వికేట్ల క్లబ్‌లో న్యూజిలాండ్ బోలర్

తెలంగాణలోకి ఒమైక్రరాన్‌ ప్రవేశించిందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -