Monday, April 29, 2024
- Advertisement -

ట్రంప్ వీటో పవర్.. హెచ్చరికలు జారీ..!

- Advertisement -

అమెరికా వార్షిక రక్షణ విధాన బిల్లును అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దేశ భద్రతకు అత్యవసరమైన అంశాలను పొందుపర్చడంలో బిల్లు విఫలమైందని పేర్కొన్నారు. ఈ బిల్లు వల్ల రష్యా, చైనాలకే ప్రయోజనం కలుగుతుందని, ఆ దేశాలకు ఇదొక బహుమతి వంటిదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన వీటో అధికారాన్ని ఉపయోగించి.. బిల్లును తిరస్కరించారు. తన పాలన కాలంలో ట్రంప్ తొలిసారి వీటో అధికారాన్ని ఉపయోగించడం గమనార్హం.

2021 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్(ఎన్​డీఏఏ) పేరుతో రూపొందిన 740 బిలియన్‌ డాలర్ల బిల్లును అమెరికా కాంగ్రెస్.. ఈ నెల మొదట్లో ఆమోదించింది. తాజా బిల్లులో.. థర్ట్​ పార్టీ పోస్టులతో సంబంధం లేకుండా నుంచి సామాజిక మాధ్యమాలకు రక్షణ కల్పించే 1996 కమ్యునికేషన్ డీసెన్సీ చట్టాన్ని రద్దు చేసే నిబంధన లేదని ట్రంప్ గతంలోనే మండిపడ్డారు. ఎన్​డీఏఏను వీటో చేస్తానని అప్పుడే హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -