Monday, May 6, 2024
- Advertisement -

వైసీపీ లోకి మాజీ ఎమ్మెల్యే.. ఆట స్టార్ట్ చేసిన జ‌గ‌న్

- Advertisement -
Vijayawada ex mla join ysrcp

ఏపీ నంద్యాల పంచాయ‌తీ సెటిల్ చేసిన జ‌గ‌న్ ఇప్పుడు విజ‌య‌వాడ‌పై దృష్టిపెట్టారు. రాజ‌ధానిలో చంద్ర‌బాబు కేంద్రీకృతమైన చోట పార్టీ జెండాను ఎగ‌రేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. విజ‌య‌వాడ‌లో పార్టీ బ‌ల‌హీనంగా ఉంద‌న్న అంచ‌నా కొచ్చిన జ‌గ‌న్ వ‌రుస‌గా చేరిక‌ల‌తో కొత్త జోష్ నింపుతున్నారు.

ఈ మ‌ధ్య అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో సుమారు నెల‌ రోజులు ఇక్క‌డే మ‌కాం వేసిన జ‌గ‌న్ పార్టీ వాస్త‌వ ప‌రిస్థితిని ప‌సిగ‌ట్టారు. అందుకే యాక్టీవ్ గా ఉన్న నాయ‌కుల‌ను పార్టీలోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ని తీసుకుని సిటీ అధ్య‌క్షుడిని కూడా చేశారు. ఇప్పుడు త్వ‌ర‌లో మ‌రో మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుని వైసీపీలోకి చేర్చుకునేందుకు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారంట‌. మ‌ల్లాది విష్ణు రెండేళ్ల నుంచి వైఎస్సార్ సీపీలో చేర‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

కాంగ్రెస్ లో ఉన్నా భ‌విష్య‌త్ ఏమీ ఉండ‌ద‌ని భావించిన విష్ణు త‌ర‌చూ చ‌ర్చా కార్య‌క్ర‌మాల్లోనూ వైఎస్ జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నారు. గ‌తంలోనే చేరాల్సి ఉన్నా అప్ప‌ట్లో ఆయ‌న బార్ లో మ‌ద్యం తాగి ఐదుగురు మృతి చెంద‌డంతో ఆగిపోయారు. ఇప్పుడు ఆ కేసులో విష్ణు ది ఎలాంటి త‌ప్పు లేద‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే తేల్చ‌డంతో ఇప్పుడు విష్ణు మ‌ళ్లీ ప్ర‌య‌త్నిస్తున్న‌రు. జ‌గ‌న్ విదేశీ టూర్ ముగించుకుని రాగానే విష్ణు వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించారు. విష్ణుకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డా ఎమ్మెల్యే టిక్కెట్ మాత్రం ఇవ్వ‌రు.

{loadmodule mod_custom,Side Ad 1}

అధికారంలోకి రాగానే విష్ణుని ఎమ్మెల్సీ చేసేందుకు వైఎస్ జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ట‌. వైఎస్ కుటుంబానికి గ‌తంలో చాలా స‌న్నిహితంగా ఉన్న విష్ణు ఇప్పుడు కూడా టిక్కెట్ తో సంబంధం లేకుండా వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించారు. ఈ ప‌రిణామం జ‌రిగితే విజ‌య‌వాడ‌లో వైసీపీ మ‌రింత యాక్టీవ్ కానుంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. జ‌గ‌న్ సోషియ‌ల్ మీడియా అస్త్రానికి వ‌ణికిపోతున్న తెలుగు త‌మ్ముళ్లు
  2. ఆంధ్రా ప‌ప్పు లోకేష్‌.. పులి జ‌గ‌న్‌..
  3. 2019 ఎన్నిక‌లే టార్గెట్‌గా వేగంగా పావులు క‌దుపుతున్న జ‌గ‌న్
  4. సీబీఐ కోర్టులో జ‌గ‌న్‌కు ఊర‌ట‌ బేయిల్ పిటీష‌న్‌ను కొట్టివేసిన కోర్టు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -