Monday, April 29, 2024
- Advertisement -

నువ్వు ఒకటంటే.. నే రెండంటా!

- Advertisement -

రాష్ట్రంలో ప్రస్తుతం 2 మీడియా సంస్థల మధ్య జరుగుతున్న పోరు చూసి.. జనం విస్తుపోతున్నారు. నువ్వు ఒక ఆరోపణ చేస్తే.. నేను 2 ఆరోపణలు చేస్తా అన్నంత లెవెల్ లో ఆ సంస్థలు తమ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో న్యూస్ కవర్ చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీబీఐ విచారించిన అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలు వరుస కథనాలతో హంగామా చేస్తుంటే.. అవిభక్త కవలలు వీణావాణి వ్యవహారానికి సంబంధించి ఏబీఎన్ అధినేత రాధాకృష్ణపై.. నమస్తే తెలంగాణ, టీ న్యూస్ హడావిడి చేస్తున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో.. యూపీయే ప్రభుత్వ హయాంలో.. కొంత కాలం కేంద్ర కార్మిక మంత్రిగా పని చేశారు. అప్పటి వ్యవహారాలు, కేంద్ర మంత్రిగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి.. కేసీఆర్ ను సీబీఐ విచారించినట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయి. సీబీఐ విచారణకు సంబంధించి వాస్తవాలు బయటపెట్టాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ ప్రత్యర్థి నాయకులు చేసిన విమర్శలను హెడ్ లైన్స్ లో పెట్టి మరీ ఆంధ్రజ్యోతి వార్తలు ప్రచురించింది. ఇదే.. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న టీన్యూస్, నమస్తే తెలంగాణకు కోపం తెప్పించింది.

అనుకుని చేసిన ఆపరేషనో.. అనుకోకుండా దొరికిన అవకాశమో ఎవరికీ తెలియదు. కానీ.. ఇదే టైమ్ లో ఏబీఎన్ అధినేత రాధాకృష్ణకు సంబంధించి నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లో సంచలన కథనాలు వచ్చాయి. అవిభక్త కవలలు వీణావాణిపై ఎప్పుడో 2012లో ఏబీఎన్ లో స్టోరీ వచ్చింది. అప్పుడు… ఆ చిన్నారుల తండ్రిని స్టుడియోకు పిలిచి లైవ్ ప్రోగ్రాం చేశారు. వీణావాణి పరిస్థితి వివరిస్తూ ప్రేక్షకులను ఆర్థిక సహాయం కోరారు. ఏబీఎన్ మీడియాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఇచ్చారు. అప్పుడు చాలా మంది నుంచి… లక్షల మొత్తంలో విరాళాలు వచ్చినా.. వీణావాణి తండ్రికి చిల్లి గవ్వ ఇవ్వకుండా.. రాధాకృష్ణే మోసం చేశారని ఆరోపిస్తూ.. ఇప్పుడు టీన్యూస్, నమస్తే తెలంగాణలో స్టోరీలు ఇచ్చారు. వీణావాణి తండ్రి వాయిస్ ను కూడా జత చేస్తూ… తమ వాదనకు నిజమే అని చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ 2 మీడియా సంస్థల మధ్య పోరు గతం నుంచే కొనసాగుతున్నా… తాజా కథనాలు, విమర్శలు, ఆరోపణలు.. వరుస కథనాలతో.. అది పీక్ స్టేజ్ కు చేరింది. వాస్తవానికి.. కేసీఆర్, రాధాకృష్ణ పరస్పరం ఇంత డైరెక్ట్ గా తీవ్ర స్థాయిలో విమర్శించుకున్న సందర్భాలు తక్కువే. కానీ.. ఈ మీడియా సంస్థల మధ్యే వార్తల యుద్ధం నడిచింది. ఇప్పుడు మళ్లీ మొదలైన ఈ పోరు ఎక్కడి వరకు వెళ్తుందో అని.. జనంలో కూడా చర్చ నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -