Monday, April 29, 2024
- Advertisement -

మూడు రాష్ట్రాల్లో మిన‌హా మిగితా రాష్ట్రాల్లో ఎండ‌లు మండిపోతాయి…

- Advertisement -

దేశ వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. దీంతో ప్ర‌జ‌లు బెంబెలెత్త‌పోతున్నారు. బ‌య‌ట‌కు రావాలంటే వ‌ణికిపోతున్నారు. ఈ సంవ‌త్స‌రం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు కొంత వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే తీపికబురు అందించింది.

తాజాగా వాతావ‌ర‌ణ శాఖ తెలుగు రాష్ట్రాల‌కు తీపికబురు అందించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో సగటు ఉష్ణగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతాయని వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ మూడు రాష్ట్రాల్లో వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచేందుకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రుతుపవనాలు సరైన సమయంలో వస్తాయని చెప్పేందుకు ఇది చక్కని ఉదాహరణ అని పేర్కొంది. అయితే 2017 ఎండలతో పోలిస్తే ఈ ఏడాది ఎండలు తక్కువగా ఉంటాయని జాతీయ వాతవరణ శాఖ వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -