Thursday, May 2, 2024
- Advertisement -

పశ్చిమ బెంగాల్, అసోంలలో తొలిదశ పోలింగ్ ఆరంభం!

- Advertisement -

పటిష్ఠ భద్రత మధ్య పశ్చిమ బెంగాల్, అసోంలలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం మొదలైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానా‌లకు తొలి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కోసం  ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

బెంగా‌ల్‌లో తొలి‌దశ పోలింగ్‌ కోసం 7,061 పోలింగ్‌ స్టేషన్లు, 10,288 పోలింగ్‌ బూత్‌లు ఏర్పా‌టు ‌చే‌యగా, 73,80,942 మంది  ఓటు వేయ‌ను‌న్నారు. అసోంలో 1,917 పోలింగ్‌ కేంద్రాల్లో 11,537 పోలింగ్‌ బూత్‌‌లను ఏర్పాటు చేశారు. ఆదివాసీలు ఎక్కువగా నివసించే పురూలియా, బంకురా, ఝూర్‌గ్రాం, తూర్పు మేదినీపూర్ జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది.

తొలి దశ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు అందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముఖ్యంగా యువ నేస్తాలు ఓటింగులో పాల్గొనాలని కోరారు. ఈ రెండు రాష్ట్రాల్లో మొదట విడత పోలింగ్ కోసం పోలీసులు భారీగా మోహరించారు.

‘ఆచార్య’ తో కలిసి వచ్చిన సిద్దా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

పుణెలో భారీ అగ్నిప్రమాదం.. 448 షాపులు దగ్దం

సినీ వ‌ర్గాల‌ను వ‌ద‌ల‌ని క‌రోనా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -