Thursday, May 2, 2024
- Advertisement -

రాజ్య‌స‌భ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన విజ‌య‌సాయి

- Advertisement -

రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పారు. ఏపీ విభజన చట్టంపై రాజ్యసభలో జరిగిన చర్చ సమయంలో తన ప్రవర్తనపై ఆవేదన చెందానంటూ ఇవాళ సభ ముందు విచారం వ్యక్తం చేశారు. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన తరువాత, నిన్న సభలో జరిగిన ఘటనపై మాట్లాడేందుకు విజయసాయికి చైర్మన్ వెంకయ్యనాయుడు అవకాశం ఇచ్చారు.

అస‌లు విష‌యానికి వ‌స్తే మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో విజయసాయి మాట్లాడారు. ఆయనకు ఇచ్చిన సమయం ముగియడంతో.. వెంకయ్య గుర్తు చేశారు. సమయం మించి పోతుందని నిలువరించే ప్రయత్నం చేయగా.. ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. సభ నుంచి వాకౌట్ చేస్తామని కాస్త గట్టిగా మాట్లాడగా.. విజయసాయి తీరుపై మిగిలిన ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇవాళ సభ ప్రారంభంకాగానే ఇదే అంశాన్ని కేంద్రమంత్రి విజయ్ గోయల్ ప్రస్తావించారు. ఛైర్మన్ వెంకయ్యకు విజయసాయి క్షమాపణ చెప్పాలన్నారు. మిగిలి ఎంపీలు కూడా డిమాండ్ చేయ‌డంతో విజ‌య‌సాయి వెంకయ్య‌కు క్ష‌మాప‌న‌లు చెప్ప‌డంతో స‌భ‌లోని స‌భ్యులు శాంతించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -