Thursday, May 2, 2024
- Advertisement -

మునుగోడు విజయం టి‌ఆర్‌ఎస్ కు మంచి బూస్టప్ !

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా మునుగోడు ఉపఎన్నిక ఫీవర్ ఏ స్థాయిలో కొనసాగిందో అందరికీ తెలిసిందే. గతంలో ఏ ఉపఎన్నికకు లేనంత హైరానా మునుగోడు బైపోల్ కు జరిగిందనే చెప్పాలి. టి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు గెలుపుకోసం శాయశక్తుల కృషి చేసినప్పటికీ మునుగోడు ఓటర్ దృష్టి మాత్రం అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ వైపే మళ్ళింది. టి‌ఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దాదాపుగా 10,297 ఓట్ల మెజారిటీతో ప్రదాన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై విజయం సాధించారు.

దీంతో మునుగోడు గడ్డపై గులాబీ జెండా ఎగిరింది. మొత్తంగా టి‌ఆర్‌ఎస్ కు 96,598 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 86,485 ఓట్లు పోలయ్యాయి. ఇక మునుగోడు కాంగ్రెస్ అడ్డాగా చెప్పుకునే ఆ పార్టీకి 23,626 ఓట్లు మాత్రమే పోలవ్వడం గమనార్హం. ఇక మునుగోడు విజయం టి‌ఆర్‌ఎస్ లో కొత్త ఉత్సాహం నింపిందనే చెప్పాలి. ఎందుకంటే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ ఓడిపోవడం, అదే సమయంలో బీజేపీ బలం పుంజుకోవడంతో ఇక తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ పనైపోయిందనే విమర్శలు గట్టిగా వినిపించాయి. ఈ విమర్శలకు చెక్ పెట్టలంటే మునుగోడులో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఈ ఉపఎన్నిక ఏమాత్రం తేడా కొట్టిన అది వచ్చే ఎన్నికల్లో గట్టిగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

దాంతో కే‌సి‌ఆర్ మొదలుకొని కే‌టి‌ఆర్ వరకు టి‌ఆర్‌ఎస్ అగ్రగణ్యులు అంతా మునుగోడులో ఎడతెరిపిలేని ప్రచారం చేశారు. మునుగోడుకు అన్నీ విధాలా వారాల జల్లు కురిపించారు. దాంతో మునుగోడు ఓటర్ దృష్టి అధికార టి‌ఆర్‌ఎస్ పై బలంగా పడింది. ఫలితంగా గత కొన్ని రోజుల పోలిటికల్ హిట్ కు తెరదించుతూ మునుగోడులో టి‌ఆర్‌ఎస్ జెండా పాతింది. ఈ మునుగోడు విజయం కే‌సి‌ఆర్ లో కొత్త ఉత్సాహం నింపుతుందనే చెప్పాలి. ఎందుకంటే.. బి‌ఆర్‌ఎస్ తో జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన గులాబీ బాస్..ఈ విజయం తో తన రాజకీయ చతురతను దేశ వ్యాప్తంగా ప్రతిబింబించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

జగన్ కు పవన్ వార్నింగ్ లు..ఫైర్ వెనుక అసలు కథ!

ముందస్తు ఎన్నికలు వస్తే లాభం ఎవరికి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -