Tuesday, April 30, 2024
- Advertisement -

టీడీపీకీ బిగ్‌ షాక్… ఆమంచి బాట‌లో అవంతి….

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డే కొద్ది చంద్ర‌బాబుకు ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. మ‌రో సారి అధికారంలోకి రావాల‌ని బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడిసికొడుతున్నాయి. ప్ర‌త్యేక‌హోదా కోసం ఒక వైపు పోరాటం చేస్తుంటే..మ‌రో వైపు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. చీరాల ఎమ్మ‌ల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ పార్టీని వీడిన వెంట‌నే… ఇప్పుడు బాబుకు మ‌రో కోలుకోలేని షాక్ త‌గిలింది. తాజాగా మ‌రో టీడీపీ ఎంపీ పార్టీని వీడుతున్నారు. ఉద‌యం పార్టీకి రాజీనామా చేసిన ఆమంచి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నార‌ని చెప్పిన కొన్ని గంట‌ల్లోపే టీడీపీలో మ‌రో బిగ్ వికెట్ ప‌డింది.

గ‌త కొన్ని రోజుల‌గా వైసీపీలోకి వ‌ల‌స‌లు భారీగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. టీడీపీని వీడుతున్న నేత‌లంద‌రూ వైసీపీలోకి వ‌స్తున్నారు.ఇప్ప‌టికే రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచికూడా త్వ‌ర‌లో వైసీపీ జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా అన‌కాప‌ల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకీ గుడ్ బాయ్ చెప్పి…. వైసీపీలో చేరేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. అవంతితో పాటు ముఖ్య నాయ‌కులు కూడా ఆయ‌న బాట‌లో న‌డిచేందుకు సిద్ద‌మవుతున్నారు.

గ‌త కొద్ది రోజులుగా పార్టీ అధిష్టానంమీద అవంతి గుర్రుగా ఉన్నారు. మంత్రి గంటా శ్రీనివాస్‌రావుకు అనుచ‌రుడిగా మొద‌టినుంచి ఉన్నారు. ఆయ‌న వైసీపీలో చేరుతున్నార‌నే వార్త‌ల నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర టీడీపీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రో వైపు పార్టీ నుంచి వ‌ల‌స‌ల‌ను ఆప‌డంలో ఏం చేయాలో తెలియ‌క బాబు నానా తంటాలు ప‌డుతున్నారు. ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌స్తుతం వైసీపీ బ‌ల‌హీనంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరుతుండంతో అక్క‌డ వైసీపీ మ‌రింత బ‌లం పంజుకోనుంది. ఆమంచి, అవంతి బాట‌లో పెద్ద ఎత్తున టీడీపీనీ వీడేందుకు నేత‌లు సిద్దంగా ఉన్నారు. ఇది ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకీ కోలుకోలేని దెబ్బె.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -