Wednesday, May 1, 2024
- Advertisement -

దట్ ఈజ్ జగన్…..సింప్లిసిటీలో సరిలేరు నీ కెవ్వరు….

- Advertisement -

వైసిపి అధినేత, సీఎం జగన్ మొదటి నుంచి నిరాడంబరంగా ఉండే వ్యక్తి. అధికారం చేపట్టక ముందు ఎలా ఉన్నాడో ఐదు కోట్ల మందిప్రజలకు సీఎంగా ఉన్నా ఆయన అలాగే ఉన్నారు. ఆహారపు అలవాట్లు, ఇతర వ్యవహారాల్లో ఎలాంటి మార్పులు లేవు. ఒక ముఖ్య మంత్రిగా ఉండి కూడా సింప్లిసిటీని పాటిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన విదేశీ దౌత్యవేత్తల‌ పారిశ్రామిక సదస్సు లోనూ తన సింప్లిసిటీని మరచిపోలేదు. జగన్ నిరాడంబరతను చూసి సదస్సుకు వచ్చిన ప్రపంచ నేతలు సైతం ఫిదా అయ్యారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఆర్భాటాలకు పోకుండా ప్రజలకోసం తాను ఏంచేయదలుచుకున్నాడో అదే చేస్తున్నాడు.అంతేకాదు, ఆయన న‌మ్మే మరో సిద్ధాంతం.. తాను చేసే పనికి పెద్దగా ప్రచారాన్ని కోరుకోక‌పోవ‌డం. పని చేసుకుంటూ పోతే ప్రచారం అదే వస్తుంది అన్న దివంగత వైఎస్ వ్యాఖ్యలను తూ.చ‌. తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక నాయకుడు జగన్.

చంద్రబాబు హయాంలో ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన సంగతి తెలిసిందే. వేల కోట్ల ప్రజల డబ్బును దుబారాగా ఖర్చు పెట్టారు.కేవలం అంతర్గత సమావేశాల్లో మర్యాదపూర్వకంగా ప్లేట్లలో ఇచ్చే డ్రై ఫ్రూట్స్ ఖర్చు దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటే బాబుగారి దుబారా ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి దుబారా వ్యయాలు ఆయనకు కొత్త కాదు. ఆయన తాగే ఆర‌లీట‌రు మంచి నీరు రూ. 80. ఇక, ఆయన మంత్రివర్గ సమావేశాలు, కలెక్టర్ల సదస్సులు వంటివాటికి ఐదు నక్షత్రాల హోటళ్లు ఉండాల్సిందే. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుబారా ఖర్చులను భారీగా తగ్గించారు. తను తగ్గేందుకు ఒక కంపెనీ నీళ్లు, పక్క వారు తాగేందుకు మరో కంపెనీ నీరు ఆయన కొనుగోలు చేయలేదు. అందరికీ ఒకే విధంగా అరలీటరు నీటిని రూ.4కే కొనుగోలు చేసుకున్నారు. డ్రైఫ్రూట్ల‌ తరహా సంప్రదాయాన్ని తక్షణమే రద్దు చేశారు. వాటి స్థానంలో రెండు బిస్కెట్లు ఇవ్వడం ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితం ఐఏఎస్ సదస్సులోను కేవలం సాంబార‌న్నం, పెరుగు అన్నంతోనే సరిపెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -