Monday, April 29, 2024
- Advertisement -

జాగ్రత్త.. ప్రమాదంలో కాంగ్రెస్ : రేవంత్ రెడ్డి హెచ్చరిక!

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికను బట్టి చూస్తే ఇదే విషయం స్పష్టమౌతోంది. కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన సీట్ గా ఉన్న మునుగోడులోనే ఆ పార్టీ ఘోర ఓటమి చవిచూడడంతో పాటు డిపాజిట్ కూడా దక్కించుకోలేక చేతులెత్తేసిదంటే.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో బలహీన పడడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే.. ఆ పార్టీలోని అతర్గత కుమ్ములాటలే అని చెప్పవచ్చు. .

ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ చైర్మెన్ అయినది మొదలుకొని.. ఆ పార్టీలోని సీనియర్ నేతలంతా ఒక్కసారిగా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వచ్చారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా అసమ్మతి నేతలను ఏ మాత్రం కలుపుకునే ప్రయత్నం చేయలేదని, తన సొంత నిర్ణయాలతోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారనే విమర్శ కూడా ఉంది. పార్టీలో ఎవరికి వారే యెమున తీరే అన్న రీతిలో నేతలంతా వ్యవహరిస్తూ ఉండడంతో.. దాని ప్రభావం పార్టీపై గట్టిగానే పడింది. ఫలితంగా రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా మూడవ స్థానంలోకి పడిపోయింది. మరి వచ్చే ఎన్నికలల లోపు పార్టీ పరిస్థితి మెరుగుపడక పోతే.. ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు.

ఇప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్ వీడి ఇతర పార్టీల గూటిలో వాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వవైభవం తీసుకోచ్చేందుకు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. ముందుగా పార్టీలోని అసమ్మతి నేతలను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని, అందరం కలిసి పని చేయాలని హస్తం నేతలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పై బీజేపీ, టి‌ఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని అప్రమత్తంగా లేకపోతే.. పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఎన్నికలకు చాలా తక్కువ సమయమే ఉందని, ఇప్పటినుంచే పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ సిద్దంగా ఉండాలని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. మరి ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వి హనుమంతరావు వంటి వాళ్ళను రేవంత్ రెడ్డి ఎలా బుజ్జగిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

బాబు బెదిరింపులు.. జగన్ సమర్థింపులు!

ఉత్తరాంధ్రలో అల్లర్లు.. బాబు స్కెచ్!

కాంగ్రెస్ కు ఓటు వేస్తే అంతే సంగతులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -