Wednesday, May 1, 2024
- Advertisement -

పవన్ పై బీజేపీ ప్రయోగించిన మంత్రం ఏంటి?

- Advertisement -

గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాలు అంతా జనసేన చుట్టూనే తిరుగుతున్నాయి. పవన్ ఏ పార్టీతో పొత్తులో ఉంటాడు ? లేదా ఒంటరిగా పోటీ చేస్తాడా ? ఇంతకీ పవన్ స్టాండ్ ఏంటి ? ఇలా రకరకాల ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటి వరకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని, అందుకోసం ఏపార్టీ తోనైనా కలవడానికి తాము సిద్దమని చెప్పిన పవన్.. విశాఖలో మోడీ భేటీ తరువాత ఒక్క ఛాన్స్ నినాదాన్ని అందుకున్నారు. దీంతో పవన్ సింగిల్ గానే పోటీ చేయబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరో వైపు పొత్తులకు తాము సిద్దమే అని చెప్పిన టీడీపీ కూడా ప్రస్తుతం సైలెంట్ గానే వ్యవహరిస్తోంది.

ఇక బీజేపీ మాత్రం పవన్ తో తమ పొత్తు కొనసాగుతుందని, వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయని ఏపీ కమలనాథులు పదే పదే చెబుతున్నారు. టీడీపీతో తమ పొత్తు ఉండబోదని, కేవలం పవన్ తోనే తమ పొత్తు ఉంటుందని బీజేపీ నేతలు చెబుతూ ఉండడంతో అటు టీడీపీతోను సత్సంబాధలు కొనసాగిస్తున్న పవన్ స్టాండ్ ఏంటి అనే దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. పవన్ టీడీపీతో కలుస్తారా ? లేదా బీజేపీ తోనే ఉంటారా ? అనే దానిపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ బీజేపీతోనే ఉంటారని, టీడీపీలో కలవబోతున్నట్లు ఆయన ఎప్పుడు ఎక్కడ చెప్పలేదని.. తాము మాత్రం టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని ” సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.

ఒకవేళ పవన్ టీడీపీతో కలిస్తే మీ స్టాండ్ ఏంటి అని యాంకర్ అడుగగా.. పవన్ మాతోనే ఉంటారని, ఉండేటట్లు చేసుకుంటామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. విశాఖలో పవన్ మోడీ మద్య జరిగిన భేటీలో పవన్ తో ఒప్పందం కుదిరిందనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ సి‌ఎం అభ్యర్థిగా కూడా పవనే ఉండేటట్లుగా ఒప్పందానికి బీజేపీ అధిష్టానం అంగీకరించిందని వాదనలు వినిపిస్తున్నాయి. ఆ వదనలకు సోము వీర్రాజు వ్యాఖ్యలు మరింత ఆధ్యం పోస్తున్నాయి. మరి పవన్ విషయంలో బీజేపీ ఎందుకంత కాన్ఫిడెంట్ గా ఉందనే దానిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికి.. పవన్ను తమ పార్టీతోనే ఉండేటట్లు చేస్తాం అని కమలనాథులు చెబుతుండడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

కర్నూల్ టూర్ లో బాబుకు ఓరిగిందేంటి ?

పాలిటిక్స్ కు పవనే కరెక్ట్ !

చంద్రబాబు ఒంటరిపోరు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -