Monday, April 29, 2024
- Advertisement -

ఒకే రోజు ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించ‌నున్న జ‌గ‌న్, బాబు

- Advertisement -

పోలింగ్‌కు నెల‌కూడా స‌మ‌యం లేక‌పోవ‌డంతో రాజ‌కీయం వేడెక్కింది. అభ్య‌ర్త‌ల ఎంపిక పూర్త‌వ‌డంతో వైసీపీ, టీడీపీలు ఎన్నిక‌ల ప్ర‌చారానికి సిద్ద‌మ‌వుతున్నారు. టికెట్ల లొల్లి పంచాయితీ వైసీపీలో కంటే టీడీపీలోనె ఎక్కువ‌గా ఉంది. 15ను టీడీపీ అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించ‌గా మ‌రుస‌టి రోజు 16 నుంచి బాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఆరోజు ఉదయం తిరుపతిలో స్వామి వారిని దర్శించుకుని సమరశంఖం పూరిస్తారు. ఇక జ‌గ‌న్ కూడా 16నే ఇడుపుల పాయ‌లో అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించి జ‌గ‌న్‌కూడా ఎన్నిక‌ల స‌మ‌ర‌శంఖం పూరించ‌నున్నారు.

తిరుప‌తిలో సేవామిత్ర, బూత్ కమిటీల సమావేశంలో పాల్గొన్న బాబు సాయంత్రం శ్రీకాకుళం సభలో చంద్రబాబు పాల్గొంటారు. 17న విజయనగరం,విశాఖ,ఉభయగోదావరి జిల్లాల్లో సభలు ఉన్నాయి. 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో చంద్రబాబు సభలు నిర్వహిస్తారు. 9న కర్నూల్, అనంతపూర్, కడప జిల్లాలో చంద్రబాబు సభలు ఉంటాయి. బ‌హిరంగ స‌భ‌ల అనంత‌రం బాబు బ‌స్సుయాత్ర ద్వారా రాష్ట్ర‌వ్యాప్తంగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

ఇక జ‌గ‌న్‌కూడా బాబుకు పోటీగా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌నున్నారు. 16న ఇడుపుల పాయ‌లో అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించిన అనంత‌రం జ‌గ‌న్‌..ప్రచారం మొదలుపెట్టి, అదే రోజు గురజాలలో సభలో పాల్గొంటారు. మరుసటి రోజు మార్చి 17న నెల్లిమర, గన్నవరం ప్రాంతాల్లో రాజకీయ ప్రచార సభలకు హాజరవుతారు.వైఎస్‌ జగన్‌ తొలుత రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని.. 25వ తేదీ తర్వాత రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వ‌హించ‌నున్నారు. వైసీపీ ప్రచారంలో వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా పాల్గొంటారని తెలిపారు. వీరిద్దరూ రోజుకు 4 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా పార్టీ వర్గాలు షెడ్యూల్ రూపొందించాయి. 22న జ‌గ‌న్ పులివేందుల‌లో నామినేష‌న్‌ను దాఖ‌లు చేయ‌నున్నారు. ఒకే రోజు నుంచి ఇరు పార్టీల అధినేత‌లు ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లు పెట్ట‌నుండ‌టంతో అస‌క్తి రాజ‌కీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరు పార్టీల నాయ‌కులు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని విజ‌య‌వంతం చేసుకొనేందుకు ప్ర‌ణాలిక‌లు రూపొందించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎవ‌రు దూసుకుపోతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -